Sunday, April 28, 2024

Amritpal singh: లొంగిపోతే హింసించరు: అమృత్‌పాల్‌కు పంజాబ్ సిఎం హామీ

- Advertisement -
- Advertisement -

 

జలంధర్(పంజాబ్): అమృత్‌సర్‌లోని అకాల్ తఖ్త్ వద్ద ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ పోలీసులకు లొంగిపోనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పోలీసులు సంసిద్ధంగా ఉన్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం ప్రకటించారు. పోలీసులు హింసించబోరని తాను అమృత్‌పాల్ సింగ్‌కు హామీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పోలీసులు తమ చట్టాలకు లోబడి పనిచేస్తారని ఆయన తెలిపారు.

రెండు రోజుల క్రితం పోలీసులు వెంబడించడంతో ఎవరో వ్యక్తులు తమ కారును వదిలి పారిపోయిన దరిమిలా హోషియార్‌పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో పోలీసులు డ్రోన్లను ఏర్పాటు చేశారు. ఆ కారులో అమృత్‌పాల్, అతని సహచరుడు ప్రపుల్‌ప్రీత్ సింగ్ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. ఎంట్రీ పాయింట్ల వద్ద నిఘాను ముమ్మరం చేశారు.

మార్చి 18న పోలీసులు అరెస్టు చేయడానికి రంగంలోకి దిగిన వెంటనే అమృత్‌పాల్, అతని అనుచరులు తప్పించుకున్నారు. అప్పటి నుంచి అమృత్‌పాల్ ఆచూకీ పోలీసులకు లభించలేదు. కాగా..గురువారం సోషల్ మీడియాలో తాజా వీడియోతో ప్రత్యక్షమైన అమృత్‌పాల్ సింగ్ తాను పరారీలో లేనని, త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తానని చెప్పారు. తాను చావుకు భయపడనని కూడా ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News