Sunday, April 28, 2024

కొత్త క్షిపణి ఇంజిన్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా

- Advertisement -
- Advertisement -

ప్యాంగాంగ్ : ఉత్తర కొరియా మరోసారి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల (ఐఆర్‌బిఎం) కోసం సరికొత్త హై థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ఇవి వ్యూహాత్మకంగా కీలకమైనవి. ఈ పరీక్షతో నమ్మకమైన, ఆధారపడదగిన ఐఆర్‌బీఎంల తయారీ వేగవంతం అవుతుందని కేసీఎన్‌ఏ పత్రిక పేర్కొంది. ఈ పరీక్ష నవంబర్ 1114 మధ్యలో జరిగినట్టు వెల్లడించింది. దేశం అత్యంత దారుణమైన అస్థిర పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో వ్యూహాత్మక దాడులు చేసే సామర్థాన్ని సైన్యానికి అందించడంలో ఈ పరీక్షలు చాలా కీలకమని ఉత్తర కొరియా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News