Sunday, April 28, 2024

ఉత్తర కొరియా నుంచి రష్యాకు భారీగా ఆయుధాలు

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలబడింది. గత ఏడాది జులై నుంచి దాదాపు 6700 షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మాస్కోకు ఉత్తర కొరియా తరలించినట్టు తెలుస్తోంది. దక్షిణ కొరియా మంత్రి షిన్ ఒన్‌సిక్ ఇటీవల మీడియాకు ఈ విషయం వెల్లడించారు. కంటైనర్ల ద్వారా 30 లక్షల 152 ఎంఎం శతఘ్ని గుండ్లను, 5,00,000 వరకు 122 ఎంఎం రౌండ్స్ గానీ తరలించి ఉండవచ్చని పేర్కొన్నారు.

రానున్న కాలంలో ఉత్తర కొరియా మరో ఉపగ్రహాన్ని కక్ష లోకి చేర్చనున్నట్టు తెలుస్తోందని, దీనికి రష్యా పూర్తిగా సహకరిస్తోందని చెప్పారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ లెక్కలు మాత్రం ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. గత సెప్టెంబర్ మొదలుకొని ఉత్తర కొరియా నుంచి దాదాపు 10 వేల కంటైనర్లలో ఆయుధాలు రష్యాకు సరఫరా అయినట్టు అవి చెబుతున్నాయి. దీనికి ప్రతిగా ఉత్తర కొరియాకు 9,000 కంటైనర్లలో ఆహార పదార్థాలను మాస్కో సరఫరా చేసినట్టు తెలుస్తోంది. వీటితో ఆ దేశంలో ధరలను అదుపు చేసినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News