Monday, April 29, 2024

టెక్సాస్‌కు కార్చిచ్చు ముప్పు

- Advertisement -
- Advertisement -

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం నుంచి కార్చిచ్చు ముప్పు వ్యాపిస్తోంది. ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రభుత్వం చిన్న చిన్న గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ పరిస్థితిని సమీక్షించి 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. దాదాపు 780 కిమీ పరిధి లోని 2,00,000 ఎకరాల్లో ఉన్న వృక్షాలను ఈ కార్చిచ్చు జ్వాలలు దహించి వేశాయి.

రాష్ట్ర ప్రజలు తమ కార్యక్రమాలను తగ్గించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని, తమ ఆత్మీయులను రక్షించుకోవాలని గవర్నర్ అబాట్ సూచించారు. హెంప్‌హిల్, రాబర్ట్ కౌంటీ, కెనేడియన్ టౌన్ నివాస ప్రాంతాల్లోకి కూడా మంటలు వ్యాపించాయి. అమెరికాలో దాదాపు 11 మిలియన్ల మంది కార్చిచ్చు ముప్పునకు సమీపంలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. టెక్సాస్ నుంచి కార్చిచ్చు ఓక్లహామాకు పాకడంతో అక్కడ రెండు కౌంటీల్లో ఉంటున్న ప్రజలను ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News