Thursday, February 29, 2024

గోమూత్ర కాదు.. అవి గోముద్ర రాష్ట్రాలు: తమిళిసై

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఉత్తరాది రాష్ట్రాలు గోముద్రను ప్రతిబింబిస్తాయే కాని గోమూత్రానికి కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ శుక్రవారం వ్యాఖ్యానించారు. డిఎంకె లోక్‌సభ సభ్యుడు డిఎన్‌వి సెంథిల్ కుమార్ ఇటీవల పార్లమెంట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తమిళిసై ఈ విధంగా స్పందించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలుపును ప్రస్తావిస్తూ సెంథిల్ కుమార్ ఇటీవల లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సెంథిల్ కుమార్ వ్యాఖ్యలను దురదృష్టకరంగా తమిళిసై అభివర్ణించారు.

తమిళనాడుకు చెందిన తాను ఈ మాటలు అనక తప్పదని, ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు ఉత్తరాది, దక్షిణాది మధ్య చీలికలు తెస్తూ ప్రకటనలు చేయడం దురదృష్టకరమని ఆమె అన్నారు. తమిళనాడుకు చెందిన ఒక ఎంపి దక్షిణాది రాష్ట్రాలను ఉత్తరాది రాష్ట్రాలను వేరుచేస్తూ వాటిని గోమూత్ర రాష్టాలుగా వర్ణించడం అనుచితమని ఆమె అన్నారు. ఇండియా థింక్ కౌన్సిల్, గుజరాత్ యూనివర్సిటీ సంయుక్తంగా ఇక్కడ నిర్వహించిన కల్చరల్ ఎకానమీ సదస్సులో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News