Thursday, May 2, 2024

డబ్బు కోసం తల్లిని వదిలేసిన క్రూరుడు సిద్ధూ

- Advertisement -
- Advertisement -
NRI sister Suman Tur alleges Sidhu
సిద్దూ సోదరి సుమన్ టుర్ ఆరోపణలు

చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ డబ్బు కోసం తన తల్లిని వదిలేశారని ఆయన సోదరి డెబ్భయి ఏళ్ల సుమన్ టుర్ ఆరోపించారు. అమెరికాలో నివసిస్తున్న సుమన్ టుర్ సిద్దూ ఓ క్రూరుడని మండిపడ్డారు. చండీగఢ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తమ తండ్రి మరణించిన తరువాత 1986 లో అత్యంత కష్టకాలంలో తమను సిద్ధూ వదిలేశాడని, తమ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పటికీ తమను వదిలేసి వెళ్లి పోయాడని , తమ తల్లి 1989 లో ఓ రైల్వే స్టేషన్‌లో మరణించారని తెలిపారు. తమ తండ్రి ఓ ఇంటిని, కొంత భూమిని సంపాదించారని, ఆయనకు పింఛను కూడావచ్చేదని చెప్పారు. సిద్దూ సొమ్ము కోసం తాము ఏనాడు ఆశించలేదని తెలిపారు. 1987 లో ఓ టీవీ ఛానెలకు ఇచ్చిన ఇంటర్వూలో తమ తల్లిదండ్రులు విడిపోవడం గురించి సిద్దూ అబద్ధాలు చెప్పాడని ,తమ తల్లిదండ్రులు కోర్టు తీర్పు ద్వారా విడిపోయినట్టు సిద్దూ చెప్పడంతో ఆయనపై తమ తల్లి కోర్టును ఆశ్రయించారని వివరించారు. జనవరి 20 న తాను సిద్దూను కలవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిపారు. తమ తల్లికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News