Sunday, May 5, 2024

22న ఎన్‌టిఆర్ టీజర్

- Advertisement -
- Advertisement -

NTR teaser will be released on 22nd of this month

 

బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ నమోదు చేసుకున్న టాలీవుడ్ చిత్రం ఆర్.ఆర్.ఆర్.ఆర్‌కి సంబంధించి ఎన్టీఆర్ టీజర్ ని ఎప్పుడు చూస్తామో.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తారక్ ఫ్యాన్స్కి శుభవార్త తెలిపింది ఆర్.ఆర్.ఆర్.ఆర్‌ టీమ్. ఎన్టీఆర్ టీజర్ ని ఈనెల 22న విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

లాక్ డౌన్ తరవాత.. సోమవారం నుంచే ఆర్.ఆర్.ఆర్.ఆర్‌ షూటింగ్ మొదలైంది. మంగళవారం ఉదయం అభిమానులకు ఓ అప్ డేట్ ఇస్తామని చిత్రబృందం ముందే చెప్పింది. ఆ అప్ డేట్ ఎన్టీఆర్ టీజర్ గురించే. షూటింగ్ మొదలైన ప్రాసెస్ మొత్తాన్ని ఓ చిన్న వీడియోగా కట్ చేసి విడుదల చేసింది చిత్రబృందం. ఈనెల 22న. ఎన్టీఆర్టీజర్ ని విడుదల చేస్తున్నామని ప్రకటించింది. ఈసారి ట్రీట్ అదిరిపోయేలా ఉంటుందని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి తప్పకుండా నచ్చుతుందని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. అజయ్ దేవగణ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 2022 సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News