Monday, May 6, 2024

కడెం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

కడెం: గత వారం రోజులుగా కడెం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. గురువారం పదివేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్‌కు రావడంతో కడెం ప్రాజెక్ట్ 9 నెంబర్ వరద గేటు , 17 నెంబర్ వరద గేటును ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్థిస్థాయి నీటిమట్టం 700 అడుగులు ఏడు టీఎంసీలు

కాగా 10000 క్యూసెక్కుల వరద నీరు జలాశయాంలోకి వచ్చి చేరడంతో 691 అడుగుల వద్ద నీటిని నిల్వ చేస్తూ 9వ నెంబర్ , 17 నెంబర్ గేటు ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. తెలంగాణలో ఇంకా రెండు రోజులు విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పై అధికారుల ఆదేశాల మేరకు 691 అడుగుల వద్ద నీటిని నిలకడగా ఉంచి పై నుంచి వచ్చే వరదని గోదావరిలోకి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News