Saturday, September 20, 2025

‘ఓజీ’ సినిమా ఫస్ట్ టికెట్ రూ. లక్ష పెట్టికొన్న అభిమాని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిత్తూరులో ‘ఓజీ’ సినిమా ఫస్ట్ టికెట్ ను హీరో పవన్ కల్యాణ్ అభిమాని లక్ష రూపాయలు పెట్టి కొన్నారు. ‘ఓజీ’ సినిమా కోసం సొంతంగా పవన్ కళ్యాణ్ పాట రాసుకున్నారు. విలన్ ఇమ్రాన్ హష్మీకి వార్నింగ్ ఇస్తూ పవన్ చెప్పే హైకూని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సాంగ్ ను పవన్ సొంతంగా రాసుకోవడంతో పాటు చిత్రంలో తానే పాడడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలంగాణ టికెట్‌ ధర జిఎస్టితో కలిపి రూ.800గా ఉంది. ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు టికెట్‌ ధరల పెంపునకు తెలంగా ఫ్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.100 (జిఎస్టితో కలిపి), మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 (జిఎస్టితో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News