Friday, September 26, 2025

మా నమ్మకం నిజమైంది

- Advertisement -
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకులు, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, తమ సంతోషాన్ని పంచుకుంది. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. “దాదాపు మూడేళ్ళ ప్రయాణం ‘ఓజీ’. ఈ కథకి ఇంతటి భారీతనం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్‌కి మొదటగా థాంక్స్ చెప్పుకోవాలి. సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “విడుదలకు ముందు సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాము. మా నమ్మకం నిజమై.. విజయం సాధించిన తర్వాత.. భయం, బాధ్యత పెరిగాయి. ఈ విజయంతో భవిష్యత్‌లో మరింత బాధ్యతగా పని చేస్తాం”అని తెలిపారు. నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చే సినిమా అందించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధతో ఈ సినిమా చేశాం. సుజీత్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్, యాక్షన్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయిక ప్రియాంక మోహన్, ప్రముఖ నిర్మాత నాగవంశీ, నిర్మాత కళ్యాణ్ దాసరి, ఎడిటర్ నవీన్ నూలి తదితరులు పాల్గొన్నారు.

ఓజీ విజయం పట్ల ఆనందం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించడం చిత్ర యూనిట్‌కి, అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది. ఈ చిత్రంపై మెగాస్టార్ మాట్లాడుతూ “ప్రతి ఒక్కరూ ఓజాస్ గంభీరగా కళ్యాణ్ బాబు ‘ఓజీ’ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. సినిమా విజయం పట్ల దర్శకుడు సుజీత్, నిర్మాత దానయ్య, తమన్‌కు శుభాకాంక్షలు. అలాగే ఇతర నటీనటులకు అభినందనలు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News