Sunday, April 28, 2024

ఇంటింటికి ఒమిక్రాన్ కిట్లు

- Advertisement -
- Advertisement -

10లక్షలు అందుబాటులో ఉంచిన వైద్యశాఖ
ఆసుపత్రుల్లో సరిపడ ఆక్సిజన్ సదుపాయం
స్థానిక ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు పెంపు
దగ్గు, జలుబు లక్షణాలుంటే ప్రజలు నిర్లక్షం చేయవద్దు
వ్యాక్సిన్ తీసుకున్న కొవిడ్ నిబంధనలు పాటించాలంటున్న వైద్యులు

Omicron kits for Hyderabad

మన తెలంగాణ/సిటీబ్యూరో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ నగరంలో ఉనికి చాటుతుంది. ఈ వేరియంట్ కేసులు నగరంలో రెండు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చి ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను జీ నోమ్ సీక్వెన్సింగ్ పంపగా ఒమిక్రాన్‌గా నిర్థ్దారణ అ య్యింది. దీంతో వైరస్ విస్తరించకుండా ఉండేందుకు వైద్యశాఖ అప్రమత్తమై ఇంటింటికి ఒమిక్రాన్ కిట్లు పం పిణీ చేయనున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 10లక్షల కిట్లు గ్రేటర్‌లో వైద్య బృందాల సహాయంతో అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో ఆసుపత్రుల్లో అక్సిజన్ కొరత ఉండటంతో థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు గాంధీ, టి మ్స్ దవఖానాలో 350 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సదుపాయం కల్పించి, చికిత్స అందించే ఆసుపత్రిలో పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడిస్తున్నారు. నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు, బస్తీదవాఖానాలో సరిపడ మందులు, వైరస్ గుర్తించేందుకు కిట్లు, తగిన సిబ్బందిని నియమించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు వందశాతం వారం రోజుల్లో పూర్తి చేస్తామని, కొ త్త వేరియంట్ పట్ల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రోజువారీ చేస్తున్న కరోనా టెస్టులు నగరంలో 20వేలకు పెంచుతున్నట్లు, ఎవరికి ఎలాంటి లక్షణాలున్న పరీక్షలు చేయించుకోవాలని, సాధారణ జలుబు, దగ్గు ఉంటే నిర్లక్షం చేయవద్దని కరోనా, జలుబు లక్షణాలతో ఒమిక్రాన్ ఉంటుందని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందితే సాధారణ లక్షణాలున్న ఆసుపత్రులకు వెళ్లాలని, వ్యాక్సిన్ తీసుకున్నా ఒమిక్రాన్ సోకే పరిస్థితి ఉంటుందని, సీరియస్ కాకుండా టీకా కాపాడుతుందని వివరిస్తున్నారు. వైరస్ జనవరి రెండోవారం నుంచి తీవ్రత పెరిగే అవకాశముందని, ఫిబ్రవరిలో మరింత తీవ్ర స్థ్దాయికి చేరే పరిస్థ్దితి కనబడుతుందని, క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలు, సంక్రాంతి పండగలను పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని చెబుతున్నారు.
మాస్కుల ధరంచడం ద్వారానే ఒమిక్రాన్‌ను వేగానికి కళ్లెం వేయవచ్చని, ఇంటా, బయట మాస్కులు ధరించాలి, భోజనం తినేటప్పుడు మాత్రమే మాస్కులు పక్కకు పెట్టాలి. తలుపులు, కిటికీలు తెరుచుకుని ఉండాలి, టీకా తీసుకున్న కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News