Sunday, April 28, 2024

తెలంగాణకు కోటి వృక్షాల హారం

- Advertisement -
- Advertisement -

One Crore trees plant in KCR Birth Day

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, వ్యవసాయానికి, గృహావసరాలకు, కలపకు, పారిశ్రామిక విస్తరణకు ఇతర అవసరాలకు అడవులను ఇష్టానుసారంగా నరికివేయడంతో వాటి విస్తీర్ణం వేగంగా తగ్గిపోతోంది. మొక్కలు మానవాళికి చేసే మేలు గురించి ఈరోజు కొత్తగా ఎవరూ చెప్పనవసరం లేదు. కానీ మానవాళి మనుగడకే ముప్పు కలిగించేంత తీవ్రంగా చెట్ల నరికివేత యధేచ్ఛగా కొన సాగింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న, అగ్ర, వర్థమాన దేశాలన్నతేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ రుతువు క్రమం నిరాటంకంగా సాగుతూవచ్చింది. గ్లోబల్ వార్మింగ్‌కు ప్రకృతి వైపరీత్యాలకీ కారణమైంది. ఈ పరిస్థితికి మీరు కారణమంటే … మీరు కారణమంటూ ప్రపంచ దేశాలు వాదులాటకు దిగాయేతప్ప… తప్పుసరిదిద్దు కోవడానికి చేయాల్సిన చర్యలపై, రూపొందించాల్సిన కార్యాచరణపై చర్చించడానికి జరిగిన సమావేశాలు ఎటువంటి సత్ఫలితాలనూ ఇవ్వలేదు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులు పచ్చదనం కరవైతే వచ్చే పెనుముప్పు గురించి ఎంతగా చెప్పినా, ఉద్యమాలు చేసినా ప్రయోజనంలేని పరిస్థితి ఏర్పడింది. అయితే హారిత ప్రియుడు ఎంపి, సంతోష్ కుమార్ దేశమంతటా హారిత భావజాల స్ఫూర్తిని వ్యాపింపజేయడానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ చేపట్టి నేను మొక్కలు నాటి మీకు సవాల్ విసురుచున్నాను … స్వీకరించి… మీరు మరొ ముగ్గురికి సవాల్ విసరండి అన్నపిలుపుతో హరితహారానికే ఒక కొత్తఊపు… అంతకుముందు ఏన్నడులేని ఓ జోష్‌ను తీసుకువచ్చారు.
తెలంగాణ పునర్నిర్మాణం పునాదుల నుంచి మొదలు కావాలి అప్పుడు మాత్రమే దీర్ఘ కాలికంగా తిష్ట వేసిన సమస్యలు పరిష్కారమవుతాయి. తెలంగాణ జన జీవితాన్నే కాదు ప్రకృతిని కూడా సమైక్య పాలన నిర్లక్ష్యం చేసింది, ఫలితంగా తెలంగాణ అభివృద్ధి క్రమంగా కుంటుపడింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం కోలుకోలేని స్థితికి చేరుకున్నది. పాలకుల నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి మార్పులు కూడా తెలంగాణ రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. పర్యావరణ విధ్వంసంలో భాగంగా అడవుల నరికివేత భారీ ఎత్తున జరిగింది. దీంతో పచ్చదనం కనుచూపుమేరలో కనబడకుండా పోయింది పర్యావరణ అసమతుల్యతకు దారితీసింది. రుతువులు క్రమం తప్పిపోయాయి, వానలు సకాలంలో కురవలేదు ఇలా కరువులకు తెరలేపింది తెలంగాణ రైతుల పరిస్థితి మాత్రమే కాదు వ్యవసాయం మీద ఆధారపడ్డ కులాలకు తిండి తిప్పలు వచ్చాయి. కరువు జిల్లాలుగా కేంద్రం గుర్తించినా సరే గత రాష్ట్ర పాలకులు మాత్రం ఆదుకునేందుకు ముందుకు రాలేదు. తెలంగాణలో ఒక పంట పండించడం కూడా కష్టంగా మారింది. ఇది ఏ ఒక్క ఏడాది చరిత్ర కాదు దశాబ్దాలుగా తెలంగాణ నేలది ఇదే పరిస్థితి, ఇప్పుడు స్వయంపాలన తరుణం. ఈ పరిస్థితులు మారాలి, పోయిన వారు తిరిగి రావాలి పల్లెలు పచ్చబడాలి, అన్నదాత తలెత్తుకొని బతుకాలి, ఇదంతా జరగాలంటే పచ్చదనాన్ని పెంచడం ఒక్కటే మార్గం. ఇది ప్రభుత్వ అధికారులు చేస్తే పూర్తయ్యే పనికాదు తెలంగాణను బాగు చేసుకోవాలనుకునే ప్రతి మట్టిబిడ్డ ఇందులో భాగస్వాములు కావాలి, అలా తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేసే పథకమే తెలంగాణకు హరితహారం.
తెలంగాణ జిల్లాలు పచ్చబడాలంటే కోట్లాది మొక్కలు పెంచాలి, ఊరూరా ఉద్యమంలా చెట్లను నాటాలి. ఇందుకోసం ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో నర్సరీలు ఎండకాలంకు ముందు ఏర్పాటు చేయాలి, ప్రతి నియోజకవర్గంలో లక్షలాది మొక్కలు నాటడం ప్రతి సంవత్సరం ఎండాకాలంలో కూడా సిబ్బందిని పెట్టి నర్సరీలలో మొక్కలు పెంచి సిద్ధం చేస్తుంది. ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను సాధించి తెలంగాణ పూదోటగా మార్చేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో అడవి దట్టంగా ఉంటే, మరికొన్ని చోట్ల అడవి లేకుండాపోయింది. నగరీకరణపెరిగి అటవి సమతుల్యం దెబ్బతిన్నది. దట్టమైన అడవి ప్రాంతంలో కూడా చెట్లు లేవు. కొన్ని సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దుక్కి దున్నిన అన్నదాత ఆకాశంవైపు చూస్తూ బతకాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వానలు సరిగాలేక పంటలు కూడా సరిగా పండడం లేదు. దీంతో ఆహార ఉత్పత్తి పెరిగిన జనాభాకు సరిపోయేంత ఉండడం లేదు. ఆహారం కొరత అంతకంత కోరత్ ఏర్పడుతూనే ఉన్నది. ఈ పరిస్థితి మారాలంటే పెద్ద మొత్తంలో కృత్రిమ అడవులను సృష్టించాలన్నది సిఎం కెసిఆర్ సంకల్పం. అందుకే తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటే బృహత్తర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
‘ఈచ్ వన్ ప్లాంట్ వన్’ నినాదంతో నాయకుల జన్మదినానికి ఎవరు కూడా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టవద్దని కట్టిన నాయకులకు చలాన్ రూపంలో ఫైన్ విధించి పర్యవరణాన్ని కాపాడుటకు తీసుకున్న అనేక నిర్ణయాలు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. జన్మదినంతో పాటు శుభాకాంక్షలు, అభినందనలు, ఇతర సన్మానం ఇతరత్రా కార్యక్రమాలలో ఎవరు కూడా పూల బొకేలు వాడ వద్దని ఆదేశాలు జారీ చేసిన సందర్భంలో నాయకులు సైతం మొక్కలను నాటి వారి అభిమానాన్ని పర్యావరణం కాపాడుట కోసం కృషిచేసిన తీరు సీజన్‌తో సంబంధం లేకుండా వారివారి కార్యక్రమాలకు మొక్కలు దర్శనమిస్తున్నారు. ఎం.పి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా అనుకున్న లక్ష్యం, గమ్యం అతి సులభంగా అందరికీ చేరడం అనుకున్నదాని కంటే కూడా విజయవంతం కావడంలో ఎం.పి. సంతోష్ కుమార్ మొక్కలు పెంచేందుకు తీసుకున్నటువంటి శ్రద్ధ్ద, చైతన్యం కెసిఆర్ జన్మదిన సందర్భంగా కోటి వృక్షార్చన పిలుపుతో పుడమితల్లికి పచ్చలహారంతో అభిషేకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అభిమానులు, అధికారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినీనటులు, క్రీడాకారులు, సైంటిస్టులు, డాక్టర్స్, ఇంజినీర్స్, సాంకేతిక నిఫుణులు, పరిశోధకులు, విద్యార్థులు, మహిళలు, సబ్బండ వర్ణాలు సైతం పిబ్రవర్ 17, తెలంగాణ ప్రదాత, కెసిఆర్ పుట్టినరోజున హారితహారంకు రెట్టింపు ఉత్సాహాంతో కోటి వృక్షార్చనలో భాగస్వామ్యులు అయ్యేందుకు సిద్ధం కావడం ముదావహం. ప్రకృతిని మనం కాపాడుదాం ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే మానవ మనుగడకు ఎంతో ప్రమాదం అనే భావంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారం 2015 జూలై 3వ తేదీన్ చిలుకూరు బాలాజీ దేవస్థానం సాక్షిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకతను చాటుకోవాలన్న దృఢ సంకల్పంతో హరితహారం చేపట్టారు. జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చి, కాలుష్యంతో ఏర్పడే దుష్పరిణామాలు క్లుప్తంగా వివరించేలా అధికారులు, గ్రామస్థాయి, వార్డు మెంబర్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలందరూ కూడా రానున్న కాలంలో మొక్కలు నాటి అడవులు రక్షించుకున్నట్లయితే కాలుష్యం వల్ల పీల్చే గాలి పాడై ఆక్సీజన్ కూడా ఖరీదు చేసే పరిస్థితి దాపరిస్తుందని, పీల్చే గాలి కోసం మంచి నివాసయోగ్యమైన వాతవరణం కల్పించడంలో అందరం భాగస్వాములు కావాలని సి,యం.కెసిఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంకల్పానికి ప్రజా చైతన్యం తోడైతే ఏదైనా సాధించవచ్చు. గత ఆరు సంవత్సరాల నుండి చేస్తున్న కృషికి సత్ఫలితాలు వస్తున్నాయి, చిట్టడవులుగా మారుతున్నాయి, రాష్ట్రం ఎర్పాటు తర్వాత 24 శాతం ఉన్న అడవులు 28 శాతంకు పెరగడం అడవులు అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం.
తెలంగాణను ఆకుపచ్చ హబ్ (గ్రీన్ హబ్) గా మార్చే మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావడానికి జనం తహతహలాడుతున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో తామూ భాగమే అన్న భావనతో హరితవిప్లవ బాటలో జనంలో పర్యావరణ కాంక్షను రగిలించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక కెటలిస్ట్‌గా మారింది. మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించి పచ్చదనం పెంపునకు దోహదపడాలన్న సందేశం ఇప్పుడు రాష్ట్రంలో క్షేత్రస్థాయికి కూడా చేరిపోయింది. రాష్ట్ర సాధన ఉద్యమం జనం అందరినీ ఎలా కదలించిందో… ఇప్పుడు హరితస్ఫూర్తిని జనం అందరిలో రగిలించిన ఘనత ఖచ్చితంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్… స్వీకర్త జోగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పమే. ఈ ఛాలెంజ్ వెనుకకూడా మరో చాలెంజ్ ఉంది. టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ‘గిఫ్ట్ ఏ స్త్మ్రల్’ కు స్పందించిన సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. ఆ అటవీ ప్రాంతంలోని సింహ భాగాన్ని సొంత నిధులతో సామాజిక వనంగా అభివృద్ధి చేయడమే కాకుండా ఎకోటూరిజం స్పాట్‌గా రూపుదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన ప్రాంతాన్ని కూడా రక్షిత అటవీ ప్రాంతంగా రూపుదిద్దుతానని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా తనవంతు సామాజిక హితానికి హరిత ఉద్యమానికీ దోహదపడుతూనే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరిటా అన్ని వర్గాల వారిలోనూ పర్యావరణ సమతుల్యత, రక్షణపై చైతన్యం రగిలిస్తున్నారు.
భూదేవికి పచ్చలహారం స్వప్న సాకారం కోసం తపిస్తున్న ఆరు దశాబ్దాల తెలంగాణ కలల స్వప్నం సాకారం చేసిన ప్రదాత సి.యం. కెసిఆర్ సంకల్పానికి దన్నుగా నిలిచిన ఎం.పి. సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరుతో అందరిని భాగస్వామ్యులుగా చేసి, చిట్టడవులుగా మార్చి, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఆకుపచ్చని సంకల్పానికి హారతులు పట్టడం అభిలషనీయం, సంతోష్ కుమార్ నేతృత్వంలో అప్రతిహతంగా కొనసాగుచున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్నంగా జనహృదయ నేత, సి.యం. కెసిఆర్ జన్మదినం పురస్కరించుకొని కానుకగా చేపట్టిన ‘కోటి వృక్షార్చన’ చేయాలన్న సంకల్పానికి జన నీరాజనాలు పడుతున్నారు. ప్రకృతి ప్రేమికుడు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, యువ మంత్రి కెసిఆర్ ఇప్పటికే ఇచ్చిన గిప్ట్ ఏ స్మైల్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత స్థాయి నుండి క్రింది స్థాయి వరకు సబ్బండ వర్ణాలు, పార్టీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా హరితహాసంతో ఆకుపచ్చ తెలంగాణలో భాగస్వాములై ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదును స్వంతం చేసుకొని, భవిష్యత్తరాలకు దిక్సూచిగా నిలవాలని అభిలషిద్దాం.

సంగని మల్లేశ్వర్
9866255355

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News