Saturday, September 23, 2023

డివైడర్‌ను ఢీకొని ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: మార్బుల్స్ లోడుతో వెళుతున్న అశోక లేలాండ్ వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడడంతో ఒక రు మృతి చెందగా మరో ముగ్గురుకి తీవ్రగాయాలైన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి బైపాస్ రోడ్డులో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీబీనగర్ నుంచి రాంపల్లికి మార్బుల్స్ లోడుతో వెళు తున్న అశోక లేలాండ్ వాహనం ఘట్‌కేసర్ బైపాస్ రోడ్డు మైసమ్మగుట్ట హెచ్‌పి పెట్రోల్ పంప్ సమీపంలో డ్రైవర్ నిర్లక్షంతో అతివేగంగా డివైడర్‌కు ఢీకొనడంతో

వాహనం బోల్తాపడడంతో వాహనంలో నలుగురు కార్మికులు ఉండగా అందులో సంజీవ అనే కార్మికులు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు, డ్రైవర్ పవన్‌కుమార్ నిర్లక్షంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News