Thursday, May 2, 2024

రాచకొండలో ఆపరేషన్ ముస్కాన్

- Advertisement -
- Advertisement -
Operation Muskan in Rachakonda
20మంది పిల్లలను కాపాడిన పోలీసులు

హైదరాబాద్: ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా రాచకొండ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 20మంది పిల్లలను పని నుంచి విముక్తి కల్పించారు. యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్, మల్కాజ్‌గిరి ఆపరేషన్ ముస్కాన్ టీం, షీటీమ్స్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో చిన్నారులకు బంధవిముక్తి కల్పించారు. ఉప్పల్, ఐడిఏ, దేవేందర్‌నగర్ కాలనీలోని కృష్ణ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న 10మంది మైనర్లకు విముక్తి కల్పించారు. ఇందులో బాలికలు 4, బాలురు 6 ఉన్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్3, మహారాష్ట్ర1, ఎపి3, టిఎస్3 ఉన్నారు. శానిటైజర్ బాటిళ్ల ప్యాకింగ్ చేస్తున్నారు. వీరికి రోజుకు రూ.200 ఇస్తున్నారు. పిల్లతో యజమాని తొమ్మిది గంటలు పనిచేయిస్తున్నాడు. పిల్లలతో పనిచేయించడమే కాకుండా డబ్బులు కూడా తక్కువగా ఇస్తున్నాడు. కంపెనీ యజమాని గంబాలి మల్లికార్జున రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపుల్లో పనిచేస్తున్న 10మంది పిల్లను కాపాడారు. వారితో పనిచేయిస్తున్న యజమానులపై కేసులు నమోదు చేశారు.

Operation Muskan in Rachakonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News