Tuesday, April 30, 2024

దేశవ్యాప్తంగా తెలంగాణ రైతు మోడల్

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా ఆయా
ప్రభుత్వాలపై ఒత్తిడి అవసరమైతే ఉద్యమ కార్యాచరణ, మోడీ ప్రభుత్వం
రైతులకు ఇచ్చిన హామీల అమలుకు మళ్లీ పోరాటం, ఢిల్లీలో జాతీయ రైతు
సంఘాల తీర్మానం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన రైతు నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతి కోసం తెలంగాణ రా ష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల ని జాతీయ రైతు సంఘాలు తీర్మానం చేశాయి. మంగళవారం ఢిల్లీలోని రికాబ్‌గంజ్ గురుద్వార్ సమావేశమందిరంలో జాతీయ రైతుసంఘాల నే తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తె లంగాణ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసా య, రైతు సంక్షేమ పథకాలపై చర్చ జరిగిం ది. రైతుబంధు, రైతుబీమా పధకాల అమలులోపాటు వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మా ణం, రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయటం తదితర అంశాలను సమావేశంలో చర్చించారు. దక్షిణ భారత రైతుసంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు వీటిని సమావేశంలో సమగ్రంగా వివరించారు. రైతుల అభ్యున్నతికోసం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి కేసిఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం తీర్మానం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాల పట్ల సమావేశం ప్రశంసలు తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ మోడల్ పథకాలను అమలు చేసేలా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని సమావేశంలో తీర్మానించారు. అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో ఈ పథకాల అమలుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. దాంతోపాటు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని కేంద్రప్రభుత్వంపై పోరుకు ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని జాతీయ రైతుసంఘాల సమావేశం తీర్మానించింది.

కేంద్ర ప్రభుత్వం మూడు నల్లచట్టాలను ఉపసంహరిస్తామని ఇచ్చిన హామీ, పంటలకు కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం , ప్రతిపంటకు కనీస మద్దతు ధర చెల్లింపు , ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీలను ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయనందున ప్రత్యేక ఉద్యమ కార్యచరణ చేపట్టాని తీర్మానించింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను ఉపసంహరణతోపాటు డబ్యుటిఓ నుండి భారత్ వైదొలగాలని , దేశ రైతులను కాపాడాలని సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. జాతీయ రైతుసంఘాల నేత శివకుమార్ కక్కాజి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోటపాటి తోపాటు కర్ణాటక నుండి కె .శాంతకుమార్, దైవ రాజ్ కేరళ నుండి, కె.వి బిజు, రాజస్థాన్ నుండి బబ్లు సింగ్, ఢిల్లీ నుండి విజయ్ సింగ్ ధబాన్, సురేష్ కుమార్ సిల్లీర్ పంజాబ్ నుండి, బల్దేవ్ సింగ్, మన్మోహన్ సింగ్, మధ్యప్రదేశ్ నుండి త్రిలోక్ కొట్టి, హర్యానా నుండి దేశ్ పాజే, రాబ్ వీందర్ కోర్ (మహిళా రైతు)తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News