Tuesday, April 30, 2024

ఉద్యోగార్థులకు ఒటిఆర్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

OTR is mandatory for job seekers

కొత్త అభ్యర్థులు
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

ఇప్పటికే ఒటిఆర్
ఉన్నవారు కొత్త జిల్లాలకు
అనుగుణంగా
మార్చుకోవాలి: టిఎస్‌పిఎస్‌సి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని, అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఒటిఆర్) తప్పనిసరిగా చేసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) వెల్లడించింది. ఒటిఆర్ ద్వారా నిమిషాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఒటిఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు కొత్త జిల్లాలకు అనుగుణంగా ఒటిఆర్‌లో మార్పులు చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ తెలిపారు. ఇప్పటికే కమిషన్ వెబ్‌సైట్‌లో ఒటిఆర్ ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులోకి ఉంచినట్లు పేర్కొన్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హతలు నమోదు చేయాలని సూచించారు. చివరి నిమిషంలో నమోదు చేస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందుకే ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

రిజిస్ట్రేషన్ ఇలా…

టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో ‘న్యూ రిజిస్ట్రేషన్’ పై క్లిక్ చేయాలి. మొబైల్ ఎంటర్ చేయగానే, ఆ నంబరుకు వన్ టైం పాస్‌వర్డ్(ఒటిపి) వస్తుంది. దానిని వెంటనే నమోదు చేయాలి.
దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా,ఈ- మెయిల్ ఐడీ, 1 నుంచి -7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు నమోదు చేయాలి.
అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తరువాత టిఎస్‌సిపిఎస్‌సి ఐడీ వస్తుంది. దీంతో పాటు జనరేట్ అయ్యే పీడీఎఫ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఒకవేళ సబ్మిట్ కన్నా ముందుగానే లాగ్ అవుట్ అయితే మళ్లీ మొదటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఒటిఆర్ ఎడిట్ ఇలా….

టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో ఒప్పటికే ఒటిఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు కొత్త జిల్లాలకు అనుగుణంగా ఒటిఆర్‌లో మార్పులు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో ఎడిట్ ఓటీఆర్‌పై క్లిక్ చేయాలి
టిఎస్‌పిఎస్‌సి ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసిన తరువాత ఫోన్ నంబరుకు ఒటిపి వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.
ఎడిట్ చేయాల్సిన వివరాలు సవరించడంతో పాటు 1 నుంచి- 7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు ఇవ్వాలి.

అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

ఈ వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్ చేసిన తరువాత కొత్త ఒటిఆర్ పీడీఎఫ్ కాపీ జనరేట్ అవుతుంది.దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News