Sunday, April 28, 2024

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పాక్ క్రికెటర్ల హవా

- Advertisement -
- Advertisement -

Pakistan cricketer ranking in Test

దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మండలి బుధవారం తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌ల పాకిస్థాన్ క్రికెటర్లు హవా కొనసాగించారు. జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన పాకిస్థాన్ ర్యాంకింగ్స్‌లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా బౌలింగ్ ర్యాంకింగ్స్ పాక్ బౌలర్లు మెరుగైన స్థానాలను సొంతం చేసుకున్నారు. జింబాబ్వే సిరీస్‌లో నిలకడైన బౌలింగ్‌ను కనబరిచి పాక్ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన హసన్ అలీ, షాహిన్ అఫ్రిది, నుమాన్ అలీలు కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. హసన్ అలీ ఆరు స్థానాలను మెరుగు పరుచుకుని 14వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. షాహిన్ అఫ్రిది 9 ర్యాంక్‌లను ఎగబాకి 22వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఇక నౌమన్ ఆరు స్థానాలు మెరుగు పరుచుకుని 46వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే టాప్10లో నిలిచాడు. అశ్విన్ 850 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ వాగ్నర్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. భారత స్టార్ బౌలర్ బుమ్రా 11వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మలు టాప్10లో చోటు నిలబెట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News