Thursday, May 2, 2024

కికెట్‌కు వీడ్కోలు పలికిన పాక్ పేసర్

- Advertisement -
- Advertisement -

Pakistan pacer Umar Gul announces retirement

ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ ముగిసిన వెంటనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2016లో పాకిస్థాన్ తరపున గుల్ చివరి వన్డే ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ ఆదివారం ముగియనుంది. ఈ టోర్నీలో గు ల్ బలూచిస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బాగా ఆలోచించిన తర్వాత బరువెక్కిన హృదయంతో క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు గుల్ తెలిపాడు.

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దేశానికి ప్రాతినిధ్యం వహి ంచిన ప్రతిసారి ఎంతో ప్రేమగా ఆడానని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడిక మంచి రోజులకు ముగింపు పలకక తప్పడం లేదని 36 ఏళ్ల గుల్ ఆవేదన వ్యక్తం చేశాడు. గుల్ 2003లో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. 2013 లో దక్షిణాఫ్రికాపై చివరి టెస్టు ఆడాడు. 47 టెస్టుల్లో 163 వికెట్లు తీసుకున్నాడు. 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు.

Pakistan pacer Umar Gul announces retirement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News