Tuesday, April 30, 2024

ఇజ్రాయెల్ ఇన్ఫార్మర్ల దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

వెస్ట్‌బ్యాంక్: ఇజ్రాయెల్‌కు ‘ఇన్‌ఫార్మర్లు గా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను ‘పాస్తీనా రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదులు దారుణంగా హత్యచేశారు.చంపిన తర్వాత వారి మృతదేహాలను ఈడ్చుకెళ్లి స్తంభానికి వేలాడదీశారు. పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్‌లో ఈ ఘటన జరిగింది.ఈ నెల 6న వెష్ట్‌బ్యాంక్‌లోని తుర్కరేమ్ శరణార్థి శిబిరానికి చెందిన ఇద్దరు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలకు కీలక సమాచారం అందించారు.దీంతో ఇజ్రాయెల్ భద్రతా దళాలు ఆ శిబిరంపై దాడి చేశాయి.పాలస్తీనాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. కాగా ఈ సంఘటన నేపథ్యంలో శనివారం తెల్లవారుజామునా శరణార్థి శిబిరానికి పాలస్తీనా మిలిటెంట్ల చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు ఇన్ఫార్మర్లుగా పని చేసిన ఇద్దరు పాలస్తీనియన్లనూ చంపేశారు. వారి మృతదేహాలను వీధుల్లో ఈడ్చుకెళ్లగా అక్కడి జనం కాళ్లతో తన్నారు.

అనంతరం ఓ కరెంటు స్తంభానికి మృతదేహాలను వేలాడదీశారు. మృతులను 31 ఏళ్ల హంజా ముబారక్, 29 ఏళ్ల ఆజమ్ జౌబ్రాగా గుర్తించినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక పేర్కొంది. మరో వైపు పాలస్తీనాకు చెందిన రెసిస్టెన్స్ ఫోర్స్ ఈ సందర్భంగా ఓ హెచ్చరిక చేసింది.‘ ఏ ఇన్ఫార్మర్ లేదా ఏ దేశ ద్రోహిని మేం క్షమించబోం. మా యోధుల హత్యకు సంబంధించిన కేసులో ప్రమేయం ఉన్నట్లు రుజువయితే మేం దాడి చేస్తాం. వెంటబడి మరీ మరణ శిక్ష విధిస్తాం’ అని పేర్కొన్నట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ న్యూస్ చానల్ వెల్లడించింది. కాగా ఈ హత్యలపై అటు హమాస్ కానీ, ఇటు ఇజ్రాయెల్ భద్రతాదళం ఐడిఎఫ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News