Saturday, May 4, 2024

రేవంత్.. చెత్త మాటలు మానుకో

- Advertisement -
- Advertisement -

లేకపోతే రాష్ట్రం నుంచి ప్రజలే నిన్ను తరిమేస్తారు
రైతుబంధు సమితి
అధ్యక్షుడు పల్లా
రాజేశ్వర్ రెడ్డి హెచ్చరిక

మన తెలంగాణ/హైదరాబాద్ : చెత్త మాటలు మాట్లాడితే పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయని రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన నోరు తెరిస్తే…పచ్చి అబద్దాలు తప్ప మరేమి రావని మండిపడ్డారు. తెలంగాణ సాధించిన కెసిఆర్ మీద, వయసు రీత్యా, హోదా రీత్యా పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు రేవంత్ మాట్లాడటం బాధాకరమన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన పైసలతో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొనుకున్న రేవం త్ రెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నాడని మండిపడ్డారు.

బుధవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో శాసనసభ్యులు ఆరూరి రమేష్‌బాబుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా మాట్లాడుతూ, రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి రైతు ఆత్మహత్యలు చాలా వరకు తగ్గాయన్నారు. దేశంలోనే రైతు ఆత్మహత్యలు తగ్గుతూ వస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్వయంగా పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని పల్లా గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని రేవంత్ చిల్లరగా వ్యాఖ్యానిస్తున్నారని మండిపరడ్డారు. తెలంగాలో కంటే బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. అయినా రేవంత్‌కు ఆత్మహత్యకు, చనిపోయిన దానికి తేడా తెలియదన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బీమా పరిహారం ఇప్పటి వరకు 80వేల మందికి ఇచ్చామన్నారు..రైతు బీమా లో సహజ మరణాలు సంభవించినా 5 లక్షల మొత్తం వస్తుందన్నారు.

ఈ పరిహారం తీసుకున్న వారంతా ఆత్మహత్యలు చేసుకున్న వారు కాదన్నారు. చివరకు రేవంత్ చచ్చిపోయినా రైతుబంధు మొత్తం వస్తుందన్నారు. రైతుల గురించి ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు … ఇప్పుడు మాట్లాడే హక్కు లేదన్నారు. రేవంత్ లాంటి దొంగకు కాంగ్రెస్ అధిష్టానం పిసిసి పదవి ఇచ్చినపుడే ఆ పార్టీ పని అయిపోయిందన్నారు. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో రైతులు చనిపోతే పరిహారం ఇస్తున్నారా? అని పల్లా ప్రశ్నించారు. డబ్బుల కోసమే రైతులు చనిపోతున్నారని కాంగ్రెస్ నేతలు అనడం సిగ్గుచేటన్నారు. రైతులకు ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని సోనియా గాంధీ చెబితేనే రైతులు నమ్మలేదన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చెబితే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News