Wednesday, December 4, 2024

కోహ్లీ సంపాదనను అధిగమించిన పంత్

- Advertisement -
- Advertisement -

భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపిఎల్ 2025 వేలంలో అత్యధిక ధర దక్కించుకుని రికార్డు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో పంత్ ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో పారితోషికం విషయంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పంత్ అధిగమించాడు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లల్లో అత్యధిక పారితోషికం పొందిన క్రికెటర్‌గా పంత్ నిలిచాడు. విరాట్‌కు ఐపీఎల్‌తో రూ. 21 కోట్లు, బీసీసీఐ కాంట్రాక్ట్‌తో రూ.7 కోట్లతో మొత్తం 28 కోట్ల పారితోషికం లభిస్తోంది. అయితే, BCCI వార్షిక ప్లేయర్ రిటైనర్‌షిప్ 2023-24లో గ్రేడ్ B కేటగిరీలో ఉన్న పంత్ సంవత్సరానికి రూ.3 కోట్ల అందుకుంటున్నాడు. కారు ప్రమాదం కారణంగా డిసెంబర్ 2022 నుండి క్రికెట్ దూరంగా ఉన్నందున పంత్ గ్రేడ్ B కేటగిరీకి పడిపోయాడు. దీంతో ఐపీఎల్‌ ద్వారా రూ. 27 కోట్లు, బీసీసీఐ కాంట్రాక్ట్‌తో పంత్‌ ఖాతాలోకి మరో రూ.3 కోట్లతో మొత్తం రూ.30 కోట్లు అందుకుంటున్నాడు.

అయితే, గతంలో గ్రేడ్ A కేటగిరీలో ఉన్న పంత్.. గాయం నుంచి కోలుకుని మళ్లీ అద్భత ఫామ్ తో రాణిస్తుండటంతో మళ్లీ గ్రేడ్ A, A+జాబితాకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో BCCI తాజా కాంట్రాక్ట్ జాబితా ప్రకటించనుంది. మరోవైపు శ్రేయాస్ అయ్యర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మను అదిగమించాడు. బిసిసిఐ కాంట్రాక్ట్ లేనప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న క్రికెటర్ జాబితాలో మూడవ స్థానానికి చేరుకున్నాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంగా పంజాబ్.. శ్రేయస్ ను రూ. 26.75 కోట్లకు దక్కించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News