Saturday, April 27, 2024

ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బిజెపి 17 స్ధానాలకు 17 గెలుస్తుంది
ఈసారి ఎన్నికల్లో మజ్లిస్‌ను మట్టికరిపిస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతాయని, అందుకోసం శ్రేణులంతా సిద్ధం కావాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదని, పార్లమెంటు ఎన్నికల్లో ఆపార్టీ అడ్రస్సు గల్లంతు అవుతుందని విమర్శించారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు లోక్ సభ ఎన్నికల కసరత్తును ప్రారంభించాయని, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహలకు సంబంధించిన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయన్నారు.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీలు రెండూ అవినీతి పార్టీలేనని ఆరోపించారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్లు సీట్లకు 17 ఖచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఈ సారి మజ్లిస్‌ను మట్టికరిపిస్తామని, ఆపార్టీ రోజు రోజుకు ఆదరణ కోల్పోతుందని విమర్శించారు. తమ పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు ప్రజాదరణ వస్తోందని, వేలాదిమంది సమావేశాలకు హాజరవుతున్నట్లు తెలిపారు. బిజెపి తొలి జాబితా విడుదలపై ఆయన మాట్లాడుతూ… తమ పార్టీపై కొన్ని శక్తులు ఆసత్య ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా చివరికి విజయం తమనే వరిస్తుందని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News