Thursday, May 2, 2024

క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొడిగించిన పేటీఎం

- Advertisement -
- Advertisement -

Paytm extended cashback offer on Gas cylinder

 

హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులకు పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను జూన్ 30 వరకు పొడిగించింది. పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే రూ.800 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ.800 నుంచి రూ.850 వరకు ఉంది. అంటే దాదాపు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను పొందొచ్చు. అయితే పేటీఎం ఈ ఆఫర్ ను మే 31 వరకు అని ప్రకటించగా.. తాజాగా దానిని జూన్ 30 వరకు పొడిగించింది. అయితే ఈ అఫర్ ను పొందాలనుకునే వినియోగదారులు ముందుగా తమ ఫోన్‌లో పేటీఎం యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ‘బుక్ గ్యాస్ సిలిండర్’ సెక్షన్‌కి వెళ్లి తమ డీలర్ షిప్‌ను ఎంచుకోవాలి.  భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్, ఇండేన్ లల్లో ఏదైనా ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం గ్యాస్ ప్రొవైడర్ వివరాలు, కన్జూమర్ నంబర్, మొబైల్ నంబర్ లేదా ఎల్పీజీ ఐడీ తదితర వివరాలు నమోదు చేసి బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలి. గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యే లోపు మీ పేటీఎం అకౌంట్లలో రూ.800 వరకు క్యాష్ బ్యాంక్ పొందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పేటిఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని క్యాష్ బ్యాక్ పొందండి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News