Monday, May 20, 2024

సాక్షాధారాలు లేకుండా ఆరోపణలు కుదరవు

- Advertisement -
- Advertisement -

Pennsylvania Court rejects Trump's appeal

వాషింగ్టన్: అమెరికా న్యాయస్థానాలలో అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ బృందానికి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, తానే విజేతనంటూ ట్రంప్ తమ ప్రచార బృందం ద్వారా పెన్సెల్వేనియా కోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు అనుగుణంగా లేని ఓట్లను తిరస్కరించాలని ట్రంప్ బృందం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలకు సరైన ఆధారాలు చూపడం లేదని పేర్కొన్న కోర్టు ఈ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఎన్నికల ఫలితాలను అధికారికంగా ధృవీకరించుకోవచ్చునని కూడా న్యాయస్థానం తెలిపింది. దీనితో న్యాయస్థానాలను నమ్ముకుని అధికారం అప్పగింతకు ససేమిరా అనాలనుకుంటున్న ట్రంప్ చతికిలపడ్డారు. ఓట్లు చెల్లవని చెపుతున్నారని. అయితే ఇందుకు సరైన ఆధారాలు చూపకుండా వీటి అర్హతను ఏ విధంగా సవాలు చేస్తారని పెన్సెల్వేనియా కోర్టు ప్రశ్నించింది. కేవలం ఊహాజనిత ఆలోచనలతోనే ట్రంప్ బృందం కోర్టులను ఆశ్రయిస్తున్నట్లుగా పరిగణించాల్సి వస్తోందని న్యాయమూర్తి మాథ్యూ బ్రాన్ ఆక్షేపించారు.

అయితే న్యాయస్థానం తీరు బాగా లేదని ట్రంప్ బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్షాధారాలను చూపేందుకు తాము తగు సమయం అడిగామని, అయితే ఇందుకు అవకాశం ఇవ్వకుండానే విన్నపాన్ని కొట్టివేయడం అనుచితం అని బృందం తెలిపింది. అయితే ఇక్కడి కోర్టు తొందరగా తీర్పు వెలువరించడం మంచిదయిందని, దీనితో తీర్పునకు వ్యతిరేకంగా తాము ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు మార్గం సుగమం అయిందని ట్రంప్ బృందం తెలిపింది. పెన్సెల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. వీటిపై ట్రంప్ బృందం ఆశపెట్టుకుంది. అయితే జో బైడెన్ దాదాపు 81 వేల ఓట్ల ఆధిక్యతతో ఉన్న దశలో ట్రంప్ వర్గం కోర్టుకు వెళ్లింది. లక్షల సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని, వీటిని రద్దు చేయాలని ట్రంప్ వర్గీయులు కోరుతున్నారు. తాను న్యాయపరంగా పోరాడుతూనే ఉంటానని, చివరి దశ వరకూ అధికార బదలాయింపును అడ్డుకుంటానని ట్రంప్ తరచూ చెపుతున్నారు. అయితే పలు కోర్టులలో వ్యాజ్యాలు ఉన్నప్పటికీ అధికార బదిలి ప్రక్రియ ఆరంభం అయింది. అధ్యక్ష మార్పిడి చట్టం ప్రకారం తగు విధంగా అధికార బదిలీ ప్రక్రియను చేపట్టినట్లు వైట్‌హౌస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News