Thursday, May 2, 2024

రెండో డోసు కోసం జనం క్యూ

- Advertisement -
- Advertisement -

People queue for second dose of Covid vaccine

జనంతో రద్దీగా మారిన ఆరోగ్య కేంద్రాలు
ఒమైక్రాన్ భయంతో జాగ్రత్తలు తీసుకుంటున్న స్థానికులు
నిర్లక్ష్యం చేస్తే థర్డ్‌వేవ్ తప్పదని హెచ్చరిస్తున్న వైద్యులు
నగరంలో సరిపడ్డ టీకా నిల్వలు ఉంచినట్లు వైద్యశాఖ వెల్లడి

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ విస్తరించకుండా వైద్యశాఖ అధికారులు గత నెల రోజుల నుంచి కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు పంపిణీ చేపట్టిన నగర ప్రజలు కొంతమంది టీకా తీసుకున్నారు. మరికొందరు పాజిటివ్ కేసులు బారీ తగ్గుముఖం పట్టాయని వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్య సిబ్బంది ఇంటింటి ప్రచారం చేసినప్పుడు పలువురు నిర్లక్షంగా మాట్లాడారు. దీంతో వైద్యాధికారులు టీకా తీసుకోకుంటే ఒకవేళ వైరస్ లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పవని, సమీపంలోని బస్తీదవాఖాన, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకా నిల్వలు సరిపడా ఉంచడంటో పాటు సిబ్బంది అందుబాటులో ఉన్నారని అవగాహన చేసిన రేపోమాపో వేసుకుంటామని చేతులు దులుపుకున్నారు. దీంతో పక్షం రోజుల పాటు టీకా పంపిణీ చేసే కేంద్రాలు జనం లేక బోసిపోయాయి. నాలుగైదు రోజుల నుంచి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.

తాజాగా ఒమైక్రాన్ వైరస్ బయట పడిందని, ప్రపంచ దేశాలు దీని దెబ్బకు వణికిపోతున్నాయని ప్రచారం రావడంతో మూడు రోజుల నుంచి వ్యాక్సిన్ కోసం జనం హెల్త్ సెంటర్ల గంటల తరబడి వేచి చూస్తున్నారు. వైద్యశాఖ అధికారులు కూ డా టీకా వేగవంతం చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా రో జుకు 1.50 లక్షల మందికి పంపిణీ చేస్తే విధంగా చర్యలు చేపట్టింది. దీనికి తోడు ఎఎన్‌ఎంలు, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు బస్తీలు, కాలనీల్లో తిరుగుతూ కరోనా మొదటి డోసు తీసుకుని సెకండ్ డోసు తీసుకోనివారి గుర్తించి త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 15 లక్షల డోసులు నిల్వ ఉంచినట్లు, వాటి ద్వారా 40 లక్షలమందికి పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు.

ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి ఆశావర్కర్, అంగన్వాటీ వర్కర్ వీఆర్‌ఏ సభ్యులుగా చేసి, ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారి నియమించి ప్రతి రోజు వ్యాక్సిన్ వేగం జరిగేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రేటర్ మూడు జిల్లాల పరిధిలో మొదటి డోసు 1,14,93,410 మంది వ్యాక్సిన్ తీసుకోగా సెకండ్ డోసు 65, 18, 980 తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 30శాతం వరకు సెకండ్ డోసు తీసుకోని వారు ఉన్నట్లు వారందరికి డిసెంబర్ 10వ తేదీలోగా వందశాతం టీకా పంపిణీ పూర్తి చేసి థర్డ్‌వేవ్ వచ్చి ఎదుర్కొంటామంటున్నారు. నగర ప్రజలు వైరస్ పట్ల నిర్లక్షం చేయకుండా ముఖానికి మాస్కులు ధరించాలని, జేబుల్లో శానిటైజర్ ఉంచుకోవాలని, పెళ్లిళ్లు, వేడుకల సందర్భంగా మాల్స్, దుకాణాల్లో జనం రద్దీ ఉందని, యాజమాన్యాలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. విందు, వినోదాలు వేడుకల పరిమిత సంఖ్యలో చేసుకోవాలని పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News