Sunday, April 28, 2024

వరుస పండగలతో మళ్లీ కరోనా భయం

- Advertisement -
- Advertisement -

People Rotating around without masks in Hyderabad

హైదరాబాద్: నగరంలో కరోనా మహమ్మారి కట్టడి చేసేందుకు వైద్యశాఖ అధికారులు ఆరునెలపాటు శ్రమించి, వైరస్ సోకిన వేలాదిమందికి చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడారు. దానికి తోడు ప్రజలకు కరోనాపై ఎప్పటికప్పడు స్దానిక వైద్యబృందాలు అవగాహన చేస్తూ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టేలా చేశారు.గత 15 రోజుల నుంచి నగరంలో రోజుకు 300లోపు కేసులు నమోదైతున్నాయి. దీంతో అధికారులు నెలరోజుల్లో వైరస్ ప్రభావం తగ్గుతుందని భావించారు. కానీ అక్టోబర్ మాసంలో కావడంతో ప్రజలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ, దసరా, దేవినవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగలు వరుసగా రావడంతో జనం గుంపులు చేరుతున్నారు. ఐదారు రోజుల నుంచి వస్త్రదుకాణాలు,కిరాణా షాపులు, ఆభరణాల దుకాణాలు సందడిగా మారాయి.

బేగంబజార్, లాడ్‌బజార్, మదీనా, సికింద్రాబాద్ జనరల్ బజార్, రాణిగంజ్, సుల్తాన్‌బజార్, గోషామహల్ వంటి ఏరియాలో వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్లు దుకాణాల యాజమానులు పేర్కొంటున్నారు. దీనికి తోడు చలికాలం కూడా ప్రారంభమయ్యే దశ కావడంతో వైరస్ మరింత పుంజుకునే అవకాశం ఉందని వైద్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సినిమా హాల్స్, స్కూల్ తెరుచుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించడంతో రోడ్లపైకి జనాలు వస్తే వైరస్ రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందంటున్నారు. సర్కార్ గణేష్ ఉత్సవాలు సందర్భంగా విధించిన ఆంక్షలు విధిస్తే కరోనా వేగానికి కళ్లెం వేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మార్చి 2వ తేదీన బయట పడిన కరోనా వైరస్ ఆరునెలల్లో గ్రేటర్‌లో 59వేలు పాజిటివ్ కేసులు నమోదుకాగా, 896మంది చనిపోయారు. వైద్యశాఖ 196 పట్టణ ఆరోగ్య కేంద్రాలు,బస్తీదవాఖానలో జూలై 11నుంచి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు ప్రారంభించి 6.60లక్షల మందికి పరీక్షలు చేసి, వైరస్ త్వరగా గుర్తించి సత్వర చర్యలు చేపట్టారు.

త్వరలో రానున్న పండుగలను ప్రజలు ఘనంగా చేయాలని భావిస్తే మళ్లీ మహమ్మారి రెచ్చిపోతుందంటున్నారు. ప్రజలు వైద్యుల సలహాలు పాటించిన ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని, వ్యక్తుల మధ్య ఆరు అడుగలు భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. రెండు రోజుల కితం కేంద్ర ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉత్సవాల సమయంలో గాత్ర కచేరీలు, జరపకుండా,రికార్డింగ్‌లు పాటలు పెట్టుకోవాలని, మండపాలు,ఆలయాల్లోకి వెళ్లేటప్పడు పాదరక్షలను చెప్పుల స్టాండ్‌లో వదలాలి.మండపాల ప్రాంగణాలను భక్తులు కాళ్లు కడుకొనే ప్రాంతాలను ఎప్పటికప్పడు శానిటైజర్ చేయాలి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఊరేగింపులో భక్తులు పరిమిత సంఖ్యలో ఉండాలని, వారి వెంటనే ఖచ్చితంగా అంబులెన్స్ ఏర్పాటు చేసుకోవాలి. చిన్నపిల్లలు,వృద్దులు ఎలాంటి ఉత్సవాల్లో పాల్గొనవద్దని పేర్కొంది. ప్రజలు అడ్డగోలుగా తిరిగే కరోనా కాటుకు బలికావాల్సి వస్తుందని స్దానిక వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News