Wednesday, May 8, 2024

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలో మళ్లీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Rain Predicted in Telangana for next 3 days

హైదరాబాద్: దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే రెండ్రోజుల్లో తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీంతో వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, ఉత్తరకోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడనున్నాయని తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమలో రేపు తేలికపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

Rain Predicted in Telangana for next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News