Tuesday, April 30, 2024

పిడుగు పాటుకు వ్యక్తి మృతి..పలు జిల్లాల్లో వడగండ్ల వాన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రమంతటా ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వ్యక్తి పడిగుపడి మృతి చెందాడు. సాయంత్రం గొర్రెలు మేపుతుండగా పిడుగు పడింది.గొర్రెలకాపరి పెద్దసైదులు మృతి చెందాడు . మూడు గొర్రెలు కూడా చనిపోయాయి. నిజామబాద్ జిల్లా సిరికొండ మండలంలో మధ్యాహ్నం భారీగా వడగండ్ల వానపడింది. ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. సిద్దిపేట జిల్లా కొండపాక ,కుకునూరు పల్లి మండలాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. నారాయణఖేడ్‌లో భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా ముఉగోడు మండలంలో భారీ వర్షం పడింది.

గడిచిన 24గంటల్లో మహబూబాబాద్ జిల్లాలోని గుడుర్గల్‌లో 68 మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. టేకులపల్లిఓ 55, అదిలాబాద్‌లో 48.2, తలమడుగులో 39.2, తామ్సిలో 35, నిర్మల్‌లో 34.6, కొండపాకలో 32.4, కోట్‌గిరిలో 32, ఆత్మకూరులో 28.2, జనగాంలో 24, ఇటిక్యాల్‌లో 23.6, సారంగపూర్‌లో 23.2, పినపాకలో 22.4, భీమదేవరపల్లిలో 21.4, మానోపాడ్‌లో 18.8, కొత్తగూడలో 15.2, తిరుమలగిరిలో 13, ఖానాపూర్‌లో 12.2, మల్లాపూర్‌లో 11.4, పాలకుర్తిలో 10.8 మి.మి చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒకమోస్తరు జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News