పుణె జిల్లా లోని చకన్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పికప్ వ్యాను అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం పాపల్ వాడి గ్రామానికి చెందిన పలువురు మహిళలు, చిన్నారులు శ్రావణమాసం సందర్భంగా కుందేశ్వర్ ఆలయానికి బయల్దేరారు. అయితే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన 30 అడుగుల లోతులోకి పడిపోయింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పింప్రిచించ్వాడ్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 10 అంబులెన్సులు అక్కడ చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల వంతున నష్టపరిహారం ప్రకటించారు.
పుణె జిల్లాలో పికప్ వ్యాన్ లోయలో పడి 8 మంది మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -