Saturday, April 27, 2024

చెట్లను పెంచడం సామాజిక బాధ్యత

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: చెట్లను పెంచడం ప్రభుత్వ బాధ్యతగా చూడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు మంచి కాలుష్య రహిత సమాజాన్ని అందిస్తామని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవ తరణ దశాభ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం తెలంగాణ హరితోత్సవం కార్యక్రమం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ వివిధ ఫ్యాక్టరీల ద్వారా, మానవాళి ద్వారా వెలువడే కార్బన్‌డైయాక్సైడ్‌లను చెట్లు పీల్చుకుని ఆక్సిజన్ మనకు అందిస్తాయి కాబట్టి చెట్లను పెంచడం ఒక సామాజిక బాధ్యతగా తీసు కోవాలని సూచించారు.

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే హరితహారం అనే కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేస్తున్నారని, బడ్జెట్‌లో 10 శాతం నిధులను పర్యావరణ పరిరోణకు కేటాయిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఎంఎల్‌ఎ సంజయ్ పేర్కొన్నారు.

జిల్లా ఎస్‌పి భాస్కర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం అందరూ మొక్కలు నాటాలని అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా హరితోత్సవం కార్యక్రమాన్ని నిర్వ హించడం జరుగుతోందన్నారు.

జిల్లాలో పోలీస్ శాఖ తరుపున మూడు నర్సరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, హరిహా రం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 6.5 శాతం అడవుల పెంపకాన్ని పెంపొందించుఓవడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పిలు ప్రకాష్, రవీంద్రకుమార్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నరేష్, ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్‌రాజు, ఆర్‌ఐలు వామనమూర్తి, నవీన్, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News