Friday, May 3, 2024

కోవిడ్ కారణంగా అనాథలైన చిన్నారులకోసం పిఎం కేర్స్ నిధినుంచి నిధులు ఇవ్వగలరా?

- Advertisement -
- Advertisement -

PM-CARES for Children Says Supreme Court

కొవిడ్ కారణంగా అనాథలైన చిన్నారులకోసం
పిఎం కేర్స్ నిధినుంచి నిధులు ఇవ్వగలరా?
కేంద్రాన్ని అడిగిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కొవిడ్ మమమ్మారి సమయంలో తమ సంరక్షకులను, లేదా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల విద్య కోసం పిఎం కేర్స్ ఫండ్‌నుంచి తక్షణం నిధులను విడుదల చేయగలుగుతారా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. చదువుకోవడం పిల్లల ప్తాహిక హక్కనే విషయాన్ని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, అనిరుద్ధ బోస్‌లతో కూడిన బెంచ్ గుర్తు చేసింది. ‘పిల్లలు స్కూల్లో ఉండాలి. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో చదువుకొంటున్న పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే ఆ స్కూళ్లలో ఫీజులు చాలా ఎక్కువగా ఉండడం ఒ వైపు అయితే, మరో వైపు 2020 మార్చినుంచి కొవిడ్ కారణంగా జీవితాలు ఛిద్రం కావడం కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారని బెంచ్ వ్యాఖ్యానించింది.

కరోనా కారణంగా పిల్లలు విద్యను కోల్పోకూడదు.. ఇలాంటి పిల్లల చదువు కోసం పిఎం కేర్స్ ఫండ్ ముందుకు వచ్చి కనీసం ఏడాది పాటు వారిని ఆదుకోవడం కోసం తక్షణం కొన్ని నిధులను విడుదల చేయగలదా అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటిని జస్టిస్ రావు అడిగారు. కేంద్రం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ఇలాంటి చిన్నారుల విద్యాభ్యాసం కోసం నిధులతో సాయపడాలని కూడా ఆయన అన్నారు. ఈ నిధులను విడుదల చేయడంపై కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలని, దరిమిలా కోర్టు తగు ఆదేశాలు జారీ చేస్తుతందన్నారు. అంతేకాదు పిఎం కేర్ నిధి కింద ఆర్థిక సాయానికి అర్హులైన చిన్నారులను గుర్తించడం జరిగిందా అని కూడా జస్టిస్ రావు ప్రశ్నించారు. కాగా పిల్లలను మూడు కేటగరీలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన వారు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయిన వారు. సంరక్షకులను కోల్పోయిన వారుగావర్గీకరించడం జరుగుతోందని భాటి చెప్పారు. అంతేకాదు ఇలాంటి పిల్లలను గుర్తించే బాధ్యతలను జిల్లా కలెకర్లకు అప్పగించినట్లు కూడా ఆమె తెలిపారు. ఈ దశలో జస్టిస్ రావు జోక్యం చేసుకుని ఇలాంటి చిన్నారుల వివరాలను రాష్ట్రాలు జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తదుపరి విచారణను బెంచ్ వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News