Wednesday, May 8, 2024

రైతులంటే గౌరవం లేని ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

pm modi does not respect farmers says rahul gandhi

 రాహుల్ గాంధీ ఆరోపణ

న్యూఢిల్లీ: రైతుల పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి ఏమాత్రం గౌరవం లేదని, కేంద్రం ఆమోదించిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు అలసిపోయి తమకు తాముగా తమ ఆందోళనను ఉపసంహరించుకోవాలని ఆయన కోరుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ జంతర్ మంతర్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలసి పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ రైతు నాయకులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రస్తుత చర్చలు కేవలం జాప్యం చేయడానికి వేసిన ఎత్తుగడగా అభివర్శించారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు రైతులు తమ ఆందోళనను విరమించుకోరని ఆయన తెలిపారు. జాప్యం కోసమే రైతు నాయకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆయన ఆరోపించారు. రైతుల ఆందోళనను విరమింపచేసే శక్తి తనకు ఉందని మోడీ భావిస్తున్నారని, అయితే పొరబడుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. రైతుల పట్ల ప్రధానికి కనీస మర్యాద లేదని, వంద మంది రైతులు మరణించినా ఆయనకు పట్టదని రాహుల్ ఆరోపించారు. అలసిపోయిన రైతులు తమ ఆందోళనను తమకు తాముగా విరమించుకుంటారని మోడీ భావిస్తున్నారని, కాని అది జరిగే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆందోళన ఇప్పుడే ఆరంభమైందని, ప్రభుత్వం తాను చేసిన చట్టాలను వెనక్కు తీసుకోకతప్పదని ఆయన స్పష్టం చేశారు. రైతుల శక్తి ఏమిటో ప్రభుత్వానికి తెలియదని, రైతులు వెనకడుగు వేసే ప్రసక్తి లేదని రాహుల్ చెప్పారు. ఈ విషయం మోడీకి అర్థం కావడం లేదని, అర్థమై ఉంటే ప్రభుత్వం ఈరోజే వ్యవసాయ చట్టాలను రద్దు చేసి ఉంటేదని రాహుల్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News