Tuesday, August 12, 2025

ఎంపిల ఫ్లాట్‌లను ప్రారంభించిన మోడీ

- Advertisement -
- Advertisement -

ఎంపీల కోసం కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్‌లను ప్రధాని నరేంద్రమోడీ సోమవారం ప్రారంభించారు. బహుళ అంతస్థుల ఈ కాంప్లెక్స్‌లో దేశం లోని వివిధ పండగలను సమష్టిగా నిర్వహించుకోవాలని పరిశుభ్రతలో పోటీ పడాలని సూచించారు. ఢిల్లీ లోని బాబా ఖరక్ సింగ్ మార్గంలో ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ నాలుగు టవర్లకు క్రిష్ణ , గోదావరి, కోసి, హూగ్లీ నదుల పేర్లు పెట్టారు. ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ టవర్స్ పరిసర ప్రాంతంలో ఓ సిందూర మొక్కను నాటారు. ఇళ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కూలీలతో ఆయన ముచ్చటించారు. ఈ నాలుగు టవర్లకు భారత దేశం లోని నాలుగు మహానదులు కృష్ణా, గోదావరి, కోసి, హుగ్లీ పేర్లు పెట్టారు. కొంతమందికి కోసి అనే పేరు పెట్టడం ఇబ్బందిగా కనిపించవచ్చు. వాళ్లు దానిని ఒక నదిగా కాకుండా, బీహార్ ఎన్నికల కోణంలో చూసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఎంపీలకు , కొత్త ఎంపీలకు నివాసాల సమస్య ఎక్కువగా ఉండేదని, యుపిఎ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 మధ్యకాలంలో లోక్‌సభ సభ్యులకు ఎలాంటి ఇళ్ల నిర్మాణాలు జరగలేదని, తమ ప్రభుత్వమే ఇప్పటికి 350 ఇళ్లు నిర్మించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్, పార్లమెంట్ భవనం, ఎంపీల కొత్త ఇళ్లు నిర్మించిందని చెప్పారు. పేదలకు నాలుగు కోట్ల ఇళ్లు నిర్మాణం జరిగిందని, వందలాది మెడికల్ కాలేజీలు, ఇళ్లకు పైపు లైన్ ద్వారా నీటిసరఫరా చేపట్టడమైందని చెప్పారు. ఎంపీల పాత ఇళ్లతో అనేక సమస్యలు ఎదురయ్యేవని, అలాంటి ఇబ్బందులు చట్టసభ సభ్యులు ఎదుర్కోకూడదని, ప్రతి సభ్యునికి 5000 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కల్పించడమైందన్నారు. సమస్యల నుంచి విముక్తి పొందినప్పుడే ఎంపీలు తమ నియోజక వర్గాల ప్రజల సమస్యలను సమయానుకూలంగా చర్చకు తీసుకు రావడానికి తమ సమయం, శక్తిని వినియోగించగలుగుతారని పేర్కొన్నారు. ఎంపీల ఇళ్ల పరిశుభ్రతపై ఏటా మూడు నాలుగు సార్లు పోటీ నిర్వహించాలని కేంద్ర మంత్రిత్వశాఖకు, రెసిడెన్షియల్ కమిటీకి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News