Tuesday, May 7, 2024

భారత భూభాగాన్ని చైనా లాక్కుందన్నది సుస్పష్టం

- Advertisement -
- Advertisement -

లద్ధాఖ్: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ లక్షంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న విషయం స్పష్టమని, కానీ మోడీ ఈ విషయాన్ని ఖండించడం బాధాకరమని పేర్కొన్నారు. లద్ధాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ శుక్రవారం కార్గిల్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. లద్ధాఖ్ ఒక వ్యూహాత్మక ప్రాంతమని, ఇక్కడ వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా లాక్కుందని స్పష్టం చేశారు. స్థానికులందరికీ ఈ విషయం తెలుసునని, లద్ధాఖ్‌లో ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించలేదని ప్రధాని మోడీ చెప్పడం బాధాకరం. ఇది అబద్ధం దుయ్యబట్టారు.

బ్రిక్స్ సమావేశాల సందర్భంగా మోడీ, చైనా అధినేత జిన్‌పింగ్‌లు సంభాషించుకున్న వేళ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. లద్ధాఖ్ ప్రజల భూమిని లాక్కొని, ఇతరులకు కట్టబెట్టాలనుకుంటోందని బిజెపిపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. స్థానికులకు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే భూమిని లాక్కోలేమని బిజెపి వాళ్లకు తెలుసని, అదే కారణంతో వారు లద్ధాఖ్ వాసులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇదిలా ఉండగా.. జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత రాహుల్ లద్ధాఖ్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. అంతకుముందు కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News