- Advertisement -
ప్రధాని నరేంద్రమోదీ ఈ ఆగస్టు 31 నుంచి చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31,సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్రసభలో ప్రధాని పాల్గొంటారు. 2019 తర్వాత ప్రధాని చైనాలో పర్యటించడం, ముఖ్యంగా 2020లో గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత ఆ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. మోదీ చైనాలోని తియాంజిన్ ను సందర్శిస్తారు. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలను టార్గెట్ చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ చైనా పర్యటన ప్రత్యేకత సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్రసభకు హాజరయ్యేముందు ప్రధాని మోదీ ఆగస్టు 30న జపాన్ ను సందర్శించనున్నారు. టోక్యోలో జపాన్ ప్రధాని ప్యూమియో కిషిడాతో కలిసి. భారత – జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా చైనా వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
- Advertisement -