Wednesday, May 22, 2024

మోడీ పర్యటన చైనాతో పోటీకి కాదు..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన చైనాకు వ్యతిరేకంగా ఇండియాను ఉసికొల్పేందుకు కాదని వైట్‌హౌస్ అధికారులు ప్రకటించారు. కేవలం భారత్, అమెరికా మధ్య సంబంధాలను విస్తృతపర్చుకోవడం, రక్షణ సహకార దిశలో సాగిన పర్యటన అని వైట్‌హౌస్ అధికారిక ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. రెండు అతి పెద్ద ప్రజాస్వామిక దేశాల నడుమ సంబంధాల పటిష్టతను ఇతర దేశంతో పోటీకి ఉద్ధేశించింది కాదన్నారు. ప్రధాని మోడీ ఇక్కడ జరిపిన అధికారిక పర్యటన చైనా విషయంలో కాదని శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో జాన్ తెలిపారు.

అమెరికా జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక సమాచార విషయాల సమన్వయకర్త అయిన జాన్ కిర్బి ప్రధాని మోడీ పర్యటనను ప్రస్తావించారు. భారత్‌కు చైనా నుంచి సవాళ్లు ఉండనే ఉన్నాయి. సరిహద్దు , ఇంతకు మించి ప్రాంతీయ క్లిష్టతలు ఎదుర్కొవచ్చు. చైనా నుంచి భారత్ అమెరికాలకు తలెత్తుతున్న పలు చిక్కుల విషయం ఇరువురు నేతల మధ్య చర్చల అజెండాలో నిలిచాయి. దీనిపై వివరించలేం. అయితే ఏది ఏమైనా ప్రధాని మోడీ అమెరికా పర్యటన చైనాకు వ్యతిరేకంగా ఉద్దేశించింది కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News