Sunday, April 28, 2024

రాజ్యసభలో ప్రధాని మోడీ భావోద్వేగం

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi Gets Emotional in Rajya Sabha

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. గులాం న‌బీ ఆజాద్ రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం ముగియ‌నంది. ఆజాద్ రిటైర్మెంట్ సంద‌ర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. తన పార్టీ కోసమే కాకుండా దేశం కోసం ఆజాద్ పనిచేశారని ప్రధాని కొనియాడారు. గులాంనబీ ఆజాద్ తనకు మంచి మిత్రుడని ఆయన పేర్కొన్నారు. జ‌మ్మూక‌శ్మీర్ ముఖ్యమంత్రిగా ఆజాద్ ఉన్న స‌మ‌యంలో ఆయ‌న చేసిన మేలును మరిచిపోన‌ని ప్రధాని చెప్పారు. క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడి జ‌రిగిన‌ప్పుడు, అక్క‌డ గుజ‌రాతీ ప‌ర్యాట‌కులు చిక్కుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో తాను ఆజాద్ వ‌ద్ద సాయం కోరాన‌ని చెప్పారు. అప్పుడు గులాం న‌బీ త‌న‌కు అనుక్ష‌ణం వారి గురించి సమాచారం ఇచ్చార‌ని మోడీ తెలిపారు. వారిని తన కుటుంబ సభ్యులను చూసినట్టు చూసుకున్నారని గుర్తుచేశారు. ఆజాద్ తో తనకు సాన్నిహిత్యం ఉందని ప్రధాని మోడీ కంటతడి పెట్టుకుంటూ రాజ్యసభలో భావోద్వేగానికి లోనయ్యారు. పదవీ విరమణ పొందుతున్న నేతల వీడ్కోలు సందర్భంగా మోడీ ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News