Sunday, April 28, 2024

చివరకు మిగిలేది మోడీ అబద్ధాల ఫ్యాక్టరీ ఒక్కటే: మమత ధ్వజం

- Advertisement -
- Advertisement -

PM's 'factory of lies' alone will remain says Mamata Banerjee

పర (పశ్చిమబెంగాల్): కేంద్ర ప్రభుత్వం ఆస్తులన్నీ అమ్ముడుపోతున్నాయని, చివరకు ప్రధాని మోడీ అబద్ధాల ఫ్యాక్టరీ ఒక్కటే మిగిలి ఉంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. పురూలియా జిల్లాలో మంగళవారం ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. రెండు ఈశాన్య రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను నిరుద్యోగులుగా చేశాయని ఆరోపించారు. ఇతర ర్యాలీల మాదిరి గానే ఈ ర్యాలీలో కూడా ఆమె చండీశ్లోకాలు పఠించారు. మత రాజకీయాలకు బలి కారాదని హితవు పలికారు. బయటి నుంచి వచ్చే గూండాలకు ఓటు వేయరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తాను ఎలాంటి బెదిరింపులకు భయపడనని, వాటికి వ్యతిరేకంగా పోరాడతానని ఆమె చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News