Sunday, May 12, 2024

ఆంఫన్ నిధులు మమత సర్కార్ హాంఫట్

- Advertisement -
- Advertisement -

Mamata govt swindled cyclone Amphan relief fund :Amit Shah

 

కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా ఆరోపణ

గోసాబా (పశ్చిమబెంగాల్ ): సుందర్బన్ ప్రాంతం లోని ఆంఫన్ తుపాన్ బాధితులను ఆదుకోడానికి కేంద్రం విడుదల చేసిన రూ.10 వేల కోట్ల నిధులను మమతాబెనర్జీ ప్రభుత్వం మాయం చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. సుందర్బన్ ప్రాంతం గోసాబాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అతని కంపెనీ ఈ నిధులను కాజేసిందని తాము అధికారం లోకి వస్తే ఈ స్కామ్‌పై దర్యాప్తు చేయించి బాధ్యులను జైలుకు పంపిస్తామని చెప్పారు. బెనర్జీ ప్రజాసంక్షేమానికి బదులు తన మేనల్లుడి సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. టిఎంసి సిండికేట్ ముఠాల పాలనను అంతమొందించడానికి బిజెపి సిద్ధంగా ఉందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News