Thursday, May 2, 2024

ఆ ‘పబ్’ పై అంత ప్రేమెందుకు?

- Advertisement -
- Advertisement -

నగరంలోని పబ్‌లపై పోలీసుల దృష్టి
పబ్ యజమానులతో డీసీపీ సమావేశం
నిబంధనలు పాటించాలని హెచ్చరిక

Police concentrate on pubs

 

మన తెలంగాణ/పంజాగుట్ట: అనగనగా ఒక పబ్బు ఆ పబ్బులో అన్ని గబ్బు పనులే పేరుకే పబ్ అంటారు. కానీ అందులో మహిళని అద్దెకు తెచ్చి మరీ అడ్డమైన పనులు చేయిస్తూ ఉంటారు. దీంతో పోలీస్‌లు ఆ పబ్ పై దాడులు నిర్వహించి కేసు నమోదు చేస్తూ ఉంటారు. అయితే ఆ గబ్బు పబ్ యజమాని మాత్రం ఆ పబ్ పేరు మార్చి తిరిగి తన దందా కొనసాగిస్తున్నాడు. గత నాలుగు ఏళ్లుగా ఈ పబ్ ఇలా కొనసాగుతుండుగా పోలీసులు ఈసారి ఆ పబ్‌పై దాడి చేసి, అన్ని నిబంధనల ప్రకారం సీజ్ చేశారు. ఈ సారి ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకొని కాస్త కఠినంగా వ్యవహిరించారు. ఒక 2 నెలల పాటు ఆ పబ్‌ని సీజ్ చేయించారు. ఇంకేముంది ఆ పబ్ యజమాని తనకున్న పలుకుబడిని ఉపయోగించి పబ్ ని తెరిపించేందుకు నెలల తరబడి ప్రయత్నాలు చేశాడు.

నగరంలోని ఒక ప్రముఖ ప్రజాప్రతినిధిని ఆశ్రయించాడు. ఇంకేముంది రంగంలోకి దిగిన ఆ ప్రజాప్రతినిధి ఆ పబ్ ఎందుకు మూసివేయించారు అంటూ స్థానిక పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారులు అక్కడ ఏం జరుగుతుందో వివరించారు. అయినా ఆ పట్టువదలని ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చాడు. కానీ వారు కూడా పరిస్థితి వివరించి ఆ పబ్ మంచిది కాదు అని. .మేము సహాయం చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో ఆ ప్రజాప్రతినిధి చివరికి కలెక్టర్ ద్వారా ప్రయత్నం చేశారు. చివరికి ఏకంగా రాష్ట్రానికి అత్యున్నత స్థాయి అధికారి వద్దకు వెళ్లి మరీ ఆ పబ్ ని తెరిపించారు. దీంతో ఈ అంశం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక పబ్‌ని తెరిపించేందుకి ఒక ప్రజాప్రతినిధి ఇంత ఒత్తిడి చేయడం ఎన్నడూ చూడలేదు అని పోలీస్ అధికారులు లోలోన మదనపడుతున్నారు.

ఒక దశలో ఈ పబ్ కోసం ఒక సిఐ స్థాయి అధికారిని బదిలీ చేయించడానికి ప్రయత్నం చేయగా ఒక ఉన్నతాధికారి జోక్యం చేసుకొని ఇందులో మా తప్పు ఏం లేదు అని, నిబంధనలు ప్రకారం వ్యవహరించామని, అతన్ని బదిలీ చేసే ప్రసస్తే లేదని తేల్చి చెప్పారూ అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి నగరంలో ఎన్నో పబ్‌లు నడుస్తున్నాయి కానీ పోలీస్‌లు సూచించిన నిబంధనలు పాటిస్తూ నడుపుతున్న పబ్‌లపై పోలీసులు ఎక్కడ దాడులు చేయడం లేదు. కేవలం హద్దులు మీరిన పబ్‌లపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఈ పబ్ పై గతంలో పలుమార్లు కేసులు నమోదు కావడం, అమ్మాయిలపై దాడి చేసిన ఆ పబ్ యజమానిపై హత్యాయత్నం కేస్ నమోదు చేశారు. అయినా తీరు మారకపోవడంతో ఆ పబ్ పై ఈ సారి కాస్త కఠినంగా వ్యవహరించారు. ఇలాంటి గబ్బు పబ్‌కి పేరున్న ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వడంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతుంది. రేపు మాపో ఈ గబ్బు పబ్బు కొత్త హంగులతో తిరిగి ఓపెన్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇదే పబ్ యజమాని బంజారాహిల్స్ ప్రాంతంలో మరో పబ్ తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేసాడు. మొత్తానికి అమ్మాయిలని ఆట బొమ్మలా మారుస్తూ పబ్ చాటున చెడ్డ పనులు చేస్తున్న ఇలాంటి వారికి ప్రజా ప్రతినిధులు మద్దతు పలకడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి పబ్‌లపై కఠినంగా వ్యవరించాలని…పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కలిపించాలని ప్రజలు కోరుతున్నారు

పబ్‌లలో అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు

పబ్ యజమానుల సమావేశంలో డిసిపి శ్రీనివాస్

మన తెలంగాణ/పంజాగుట్ట: పబ్‌లల్లో అసాంఘిక కార్యకలాపా లు, డ్రగ్స్ వినియోగం లాంటివి చేస్తే చర్యలు తప్పవని డిసిపి ఎఆర్ శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం వెస్ట్ జోన్‌లోని అన్ని పబ్స్, బార్ల యాజమాన్యాలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో పబ్బులలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అలాంటి వాటిపై ఉపేక్షించేది లేదన్నారు. అదే విధంగా మద్యం సేవించిన కస్టమర్‌లకు డ్రైవర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. నిబంధన మేరకు సూచించిన సమయానికి పబ్‌లు మూసి వేయాలని ఆయన తెలిపారు. అలాగే మహిళా కస్టమర్ ల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, నేర చరిత్ర ఉన్నవారిని పనిలో పెట్టుకోరాదని, మైనర్‌లకు మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మహిళల వాష్ రూమ్‌ల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పబ్‌ల నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిబంధనలు కాదని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పబ్‌ల యజమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News