Sunday, April 28, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్… మొక్కలు నాటిన వృద్ధులు

- Advertisement -
- Advertisement -

Trees are planted in Green India challenge

సిద్దిపేట: రాజ్యసభసభ్యుడు  జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు మొక్కలు నాటుతున్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో 1100 దేవాలయాల్లో 1100 జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా వృద్దాశ్రమం లోని వృద్ధులు జమ్మి చెట్టు మొక్కలను నాటారు.

శనివారం ఉదయం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని నాచారం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం లో-1, జమ్మి చెట్టు, ఆర్యవైశ్య వృద్ధాశ్రమంలో-1, ఆర్యవైశ్య అన్నదాన సత్రం లో-1, మొత్తం 3 మూడు జమ్మి చెట్టు మొక్కలు నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాచారం లక్ష్మీ నరసింహ స్వామి ట్రస్ట్ మెంబెర్ నంగునూరి సత్యనారాయణ, అధ్యక్షుడు బాలాజీ గుప్త, పాలకవర్గం సుధాకర్ ఎల్ డిసి, స్వామి, గోపి పంతులు, ఈశ్వరయ్య, రంగయ్య, అంజయ్య, నారాయణ సత్తయ్య, వృద్ధాశ్రమం లోని వృద్దులు, దేవాలయం కమిటీ సభ్యులు ,ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News