Wednesday, May 1, 2024

కుటుంబ కథా చిత్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

New Movie on Kodi ramakrishna direction

 

లెజెండరీ డైరెక్టర్ కోడిరామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి తన తండ్రి ఇన్‌స్పిరేషన్‌తో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్, మురళీమోహన్, యస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కోటి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు.

ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్‌లపై నిర్మాత రామలింగేశ్వర రావు క్లాప్ నివ్వగా, ఏ.యం. రత్నం కెమెరా స్విచాన్ చేశారు. కె.రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు కార్తీక్ శంకర్ మాట్లాడుతూ “ఇది నా మొదటి చిత్రం. లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ బ్యానర్‌లో నేను దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది”అని అన్నారు. చిత్ర నిర్మాత కోడిదివ్య మాట్లాడుతూ “ఇది చక్కటి కుటుంబ కథా చిత్రం. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది”అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్ : రాజ్ కె. నల్లి, లిరిక్స్ : భాస్కర్ పట్ల, ఎడిటర్ : విప్లవ్ నైషదం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News