Wednesday, May 22, 2024

‘సుగ్రీవ’ సినిమా షురూ

- Advertisement -
- Advertisement -

Sugreeva cinema shooting

విక్రమ్ సాయి ప్రొడక్షన్స్ పతాకంపై వంశీ, అనిల్, కృష్ణ ప్రియ హీరోహీరోయిన్లుగా నిర్మాతలు మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ‘సుగ్రీవ’. కొత్తపల్లి నగేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రచయిత, -దర్శకుడు బివిఎస్ రవి క్లాప్‌నివ్వగా, ప్రముఖ నటుడు మహేష్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మధుసూదన్ రెడ్డి, ఏడుకొండలు రెడ్డి మాట్లాడుతూ.. “ఈ చిత్రం కథ చాలా బాగుంటుంది.

అందరూ మెచ్చే కథతో వస్తున్నాం”అని అన్నారు. దర్శకుడు కొత్తపల్లి నగేష్ మాట్లాడు తూ.. “ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఒకరకంగా ఇది మ్యూజికల్ చిత్రం అని చెప్పొచ్చు. ఈ నెల 21వ తేదీ నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్నాం” అని అన్నా రు. హీరోయిన్ కృష్ణ ప్రియ, మరో హీరో అనిల్‌తో పాటు రవి, ఉమంత కల్ప, కృష్ణ, లెనిన్ సింహ, కృష్ణ కాంత్, చిట్టి, శేకింగ్ శేషు, ప్రముఖ నిర్మాత రవి పైడిపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వంశీ, అనిల్, కృష్ణ ప్రియ, తనికెళ్ల భరణి, ఆనంద్ చక్రపాణి, ‘ఆర్‌ఎక్స్ 100’ కరణ్, పార్వతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: రవి.వి, కొరియోగ్రఫీ: జిత్తు, ఎడిటర్: తమ్మిరాజు, మ్యూజిక్: నందన్ రాజు బొబ్బిలి, లిరిక్స్: కృష్ణకాంత్, ఫైట్ మాస్టర్: రామకృష్ణ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News