Thursday, May 2, 2024

ఉత్తమ్‌పై ట్రోలింగ్.. కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్‌పై అధిష్టానం వేటు

- Advertisement -
- Advertisement -

ఉత్తమ్‌పై ట్రోలింగ్.. రంగంలోకి అధిష్టానం…
యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్‌పై అధిష్టానం వేటు
మరోవైపు యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇంఛార్జి ప్రశాంత్‌తో పాటు
మరో నలుగురిపై పోలీసులు ఐపిసి 154, 157 సెక్షన్ల కింద కేసు నమోదు
నేడు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. మాజీ పిసిసి చీఫ్, నల్గొండ ఎంపీఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు వార్ రూమ్‌పై దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సొంత పార్టీకి చెందిన వారిపై ట్రోలింగ్ చేసినందుకు అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్ ప్రశాంత్‌పై మంగళవారం వేటు వేసింది. అతనిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరో వైపు ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు ఐపిసి 154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా గత కొంతకాలంగా ఉత్తమ్‌తో పాటు భట్టి విక్రమార్క, వి హనుమంతరావు, జగ్గారెడ్డి తదితర సీనియర్లపై ట్రోలింగ్ నడుస్తోంది. దీంతో మే5న ఉత్తమ్ కుమార్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నెంబర్ నుంచి తనపై పదే పదే ట్రోలింగ్ జరుగుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నెంబర్ ఆధారంగా కూపీ లాగారు. ఉత్తమ్ ఇంటికి సమీపంలోని ఫ్లాట్ నుంచి ట్రోలింగ్ జరుగుతున్నట్లుగా గుర్తిం చి సోమవారం రాత్రి సోదాలు నిర్వహించారు. సదరు ఫ్లాట్ యూత్ కాంగ్రెస్ పేరుతో వున్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి నుంచి కంప్యూట ర్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సొంత పార్టీ నేతలపై ట్రోలింగ్ జరుగుతుండటం తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రాధాన్యత సంతరిం చుకుంది. అయితే దీనికి తమకు సంబంధం లేదని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి చెప్పారు. దీనికి పాల్పడిన వారు ఎవరో తేల్చాలని ఆయన పోలీసులను కోరారు. అయితే యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాకైందా? అన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాడులు చేయడం దుర్మార్గం
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపణ
హైదారాబాద్ యూత్ డిక్లరేషన్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. సోషల్ మీడియా ద్వారా భారీ ప్రచారానికి ప్రయత్ని స్తుంటే పోలీసులు తమ కంప్యూటర్లన్నింటినీ తీసుకెళ్లారని మరోవైపు యువజన కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎలాంటి సమా చారం ఇవ్వకుండా దాడులు చేయడం దుర్మార్గమని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి ఆరోపించారు. లాప్‌ట్యాప్‌లు ఎత్తుకెళ్లడం చట్ట విరుద్ధమని తెలిపారు. అయితే అసలు కాంగ్రెస్ సోషల్ మీడియా టీంపై ఫిర్యాదులు చేసింది పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డేనని పోలీసులు చెబుతున్నారు. గతంలో తమను కోవర్టులుగా చిత్రీకరిస్తూ ఇతర పార్టీల్లో చేరుతున్నట్లుగా కొంత మంది పోస్టర్లు వేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్జి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ ఫిర్యాదు ఆధారంగానే సోదాలు చేశామని పోలీసులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట మాదాపూర్‌లోని కాంగ్రెస్ వార్‌రూమ్‌లో పోలీసులు దాడులు చేపట్టడం కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్‌కు సునీల్ కనుగోలు వ్యూహకర్తగా పనిచేస్తోన్నారు. ఆయన ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని ఓ బిల్డింగ్‌లో కాంగ్రెస్ వార్‌రూమ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో బిఆర్‌ఎస్ నేతలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణలతో కార్యాలయంలో తనిఖీలు చేశారు. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. అలాగే సునీల్ కనుగోలుతో పాటు పలువురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో అప్పట్లో హైకోర్టును కాంగ్రెస్ ఆశ్రయించింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా కార్యాలయంపై దాడి జరగడం అనూహ్యంగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News