Saturday, April 27, 2024

టివి9 మాజీ సిఇఒ ఇంట్లో పోలీసుల సోదాలు

- Advertisement -
- Advertisement -

TV9 Former CEO

 

అదుపులోకి ఎంబిఎస్ జ్యువెలరీస్ అధినేత సుఖేష్‌గుప్తా
రూ.110కోట్ల భారీ ఫెనాన్స్ కుంభకోణంలో నిందితుడు సుఖేష్‌గుప్తా

పోలీసుల అదుపులో సుఖేశ్‌గుప్తా

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంబిఎస్ జ్యూవెల్లరీస్ అధినేత సుఖేశ్‌గుప్తా టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ ఇంట్లో తలదాచుకున్నాడన్న పక్కా సమాచారంతో శుక్రవారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిసిఎస్ పోలీసులు సోదాలు నిర్వహిం సుకేశ్‌గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారాహిల్స్‌లోని రోడ్ నం.14లోని బిఎన్ రెడ్డి కాలనీలోని రవిప్రకాశ్ ఇంట్లో ముసద్దీలాల్ జ్యూవెల్లరీస్ అధినేత సుఖేశ్‌గుప్తా తలదాచుకున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిపారు. సుకేశ్‌గుప్తాపై సిరి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అసోసియేట్స్ ప్రసిడెంట్ వేణుగోపాలల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సిసిఎస్ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో సుకేశ్‌గుప్తానును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

2018లో ఆయన సిరి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి రూ.110 కోట్ల భారీ మొత్తాన్ని రుణంగా తీసుకున్నారు. లోన్ తీసుకునే సమయంలో ఆయన ఆస్తులను ష్యూరిటీగా పెట్టారు. నగర శివారులోని హఫీజ్‌పేట్ లో ఉన్న 8 ఎకరాల స్థలం, కింగ్ కోఠి లోని నజ్రిబాగ్ ప్యాలెస్‌ను సుఖేశ్ గుప్తా తాను తీసుకున్న రుణానికి ష్యూరిటీలుగా పెట్టారు. కేవలం మూడునెలలు మాత్రమే ఎంఐలు కట్టిన సుఖేష్ గుప్తా ఆ తరువాత నుంచి డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ఆస్తులను వేలం వేయాలని భావించింది. ఈక్రమంలో ష్యూరిటీలుగా పెట్టిన ఆస్తులను సుకేశ్‌గుప్తా వేరొకరికి విక్రయించినట్లు తెలియడంతో సదరు ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీగా రుణం తీసుకుని తనఖా పెట్టిన ఆస్తులను తమకు తెలియకుండా విక్రయించి మోసం చేశారంటూ సిరి ఫైనాన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఎంబీఎస్ అధినేత సుఖేష్ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేష్ కుమార్ అనే నలుగురిపై సిసిఎస్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 420, 406 రెడ్ విత్ యాక్ట్ 34 ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు సుఖేష్ గుప్తా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు సుఖేష్ గుప్తా బంజారాహిల్స్‌లోని బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న టివి9 మాజీ సిఇఒఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానించి సోదాలు నిర్వహించి ఎట్టకేలకు ఎంబిఎస్ అధినేత సుఖేష్ గుప్తాను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

Police searching at TV9 Former CEO Home
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News