- Advertisement -
హైదరాబాద్: ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బిసిలు బిజెపిని తిరస్కరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమని అన్నారు. ఢిల్లీ‘‘ శాసనసభలో బిసి బిల్లుపై తీర్మానం సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి చావుతప్పి కన్నులొట్ట అన్నట్లుగా గెలిచిందని విమర్శించారు. బిసి రిజర్వేషన్ల (BC Reservations) కోసం తుదివరకు పోరాడుతామని సవాల్ విసిరారు. బిసి రిజర్వేషన్లు పెంచపోతే వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
- Advertisement -