Friday, April 26, 2024

ప్రభుత్వ బడుల్లో నాణ్యతలేని మధ్యాహ్న భోజనం

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో ః నగరంలోని ప్రభుత్వం పాఠశాలతో విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం నాణ్యత లేకపోవడంతో చిన్నారులు తినడానికి విముఖత చూపుతున్నారు. గత రెండు రోజుల నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కావడంతో విద్యార్థులకు బోజనం పెట్టిన తరువాత ఇంటికి పంపిస్తున్నారు. కానీ రోజు చిన్నారులకు పెట్టే భోజనం రుచి తగ్గడంతో కొంతమంది విద్యార్థులు తినకుండా ఇంటికి వెళ్లి తింటున్నారు. రెండు పూట బడులు ఉన్నప్పుడు సక్రమంగా అందించిన నిర్వహకులు రెండు మూడు రోజుల నుంచి పట్టించుకోవడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం స్కూళ్లల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడంతో పాటు మనబస్తీ,మనబడి కార్యక్రమం ద్వారా బడులకు కొత్తరూపం రావడంతో ప్రైవేటు స్కూళ్ల మాఫియా సర్కార్ స్కూళ్లకు ఆదరణ తగ్గేలా కుట్రలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. ఈవిద్యాసంవత్సరంలో కార్పొరేట్ బడుల నుంచి సుమారుగా 13వేల మంది విద్యార్థులు సమీపంలో ఉన్న ప్రభుత్వం స్కూల్ చేరారు. ఇది భవిష్యత్తులో ప్రైవేటు స్కూళ్లకు ముప్పుగా మారవచ్చని భావిస్తూ విద్యాశాఖ అధికారులతో వసతులు అందకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలో 689 ప్రభుత్వ పాఠశాలుండగా వాటిలో 1.10లక్షల మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు.

విద్యాశాఖ అధికారులు వివరాల ప్రకారం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 5. 46పైసలు, 6వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ. 8.17 పైసలు, 9, 10 తరగతుల విద్యార్థులకు 10.67 పైసలు చెల్లిస్తున్నారు. గత ఐదారు రోజుల నుంచి చిన్నారులకు నీళ్లచారు, పప్పులు, నాణ్యతలేని గుడ్డు, అందజేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. మరోపక్క వంట నిర్వహకులు ప్రభుత్వం విద్యార్ధులకు అందించే ధరలతో సరిపడ కూరగాయలు, పప్పులు, నూనెలు నాణ్యమైనవి కొనుగోలు చేయలేమని చెబుతున్నారు.

ఒక విద్యార్దికి రూ. 7 నుంచి రూ.12 వరకు ఇస్తే గిట్టుబాటు అవుతుందని, తక్కువ ధరలతో రుచికరమైన వంట చేయడం సాధ్యంకాదని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం వచ్చే బిల్లులు నెలవారీ చెల్లిస్తే సరుకులు నాణ్యమైన తీసుకొస్తామని వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News