Sunday, April 28, 2024

ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌పై నేడు శుభవార్త

- Advertisement -
- Advertisement -

Positive News On Oxford Covid-19 Vaccine

లండన్ : ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టు తయారు చేసిన వ్యాక్సిన్‌పై గురువారం శుభవార్త వెలువడనుంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆస్ట్రాజెనేకాకు లైసెన్సు మంజూరైంది. ఈనెల మొదట్లో వ్యాక్సిన్ తయారీదారులు ఇంతవరకు నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాధి నిరోధక శక్తి తమకు ప్రోత్సాహకరంగా కనిపించిందని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రాజెక్టు మనుషులపై ట్రయల్స్ నిర్వహించడంలో ఈపాటికే తుదిదశకు చేరుకుంది. బ్రెజిల్‌లో గత నెల మూడో దశ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

వేలాది మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ప్రయోగాలు సాగిస్తున్నారు. ఆస్ట్రాజెనేకా సహకారంతో వ్యాక్సిన్ ప్రాథమిక ట్రయల్స్‌పై గురువారం శుభవార్త వెలువడుతుందని తాను విన్నట్టు ఐటివి పొలిటికల్ ఎడిటర్ రాబెర్టు పెస్టాన్ తన బ్లాగ్‌లో పోస్టు చేశారు. పరిశోధకులు ఆశించినట్టుగానే యాంటీబాడీ (ప్రతి రక్షకాలు)లను, టికణా (సంహరించే కణాలు) లను ఈ వ్యాక్సిన్ తగిన విధంగా ఉత్పత్తి చేస్తోందని వివరించారు. ఈ వ్యాక్సిన్ ప్రభావితం చేయగలదని నిరూపణ అయితే సెప్టెంబర్ నాటికి భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమౌతుందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News