Tuesday, May 7, 2024

గ్రూప్ 2 పరీక్ష వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నవంబర్ 3,4 తేదీలలో జరగాల్సిన గ్రూప్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) వాయిదా వేసింది. 2024 జనవరి 6,7 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పాటు నవంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పోలీసులు, పరీక్షల సిబ్బంది, రవాణా ఏర్పాట్లు కష్టమని భావించిన టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్ -2 పరీక్ష వాయిదా, కొత్త తేదీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు.

రెండో సారి వాయిదా
గ్రూప్ -2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేసిన కమిషన్.. నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మరోసారి ఈ పరీక్షను వాయిదా వేశారు. 783 గ్రూప్ -2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News