Tuesday, May 21, 2024

ప్రభాస్ 25వ సినిమా అప్డేట్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

Prabhas 25th Movie announce on Oct 7

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది.  కొత్త కొత్త రచయితలకు అవకాశాలు ఇస్తూ.. తన ఇమేజ్ మరింత పెంచుకుంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈయనకు ఫ్యాన్ బేస్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. తాజాగా ప్రభాస్ 25వ సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. కచ్చితంగా గతంలో ఆయన ఎప్పుడూ చేయనంత కొత్తగా.. సరికొత్త జోనర్‌లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు తనను ఎవరూ చూడనంత కొత్తగా తన 25వ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారు ప్రభాస్. తాజాగా ప్రభాస్ 25వ సినిమా గురించి అక్టోబర్ 7న వివరాలు వెల్లడించనున్నట్లు టి సిరీస్ సంస్థ ప్రకటించింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సినిమా కోసం ఓ క్రేజీ దర్శకుడు పని చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్‌కు ఎలాంటి పాత్ర చేసినా కూడా అభిమానులు ఒప్పుకుంటారు. యాక్షన్ రోల్ చేస్తే అంతకంటే పండగ మరోటి ఉండదు.. సేఫ్ కూడా. అయినా సరే.. 25వ సినిమాను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్. కచ్చితంగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మరో స్థాయిలో ఉంటుందని.. ఆయన నటన మరే సినిమాలో చూడనంత స్థాయిలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పలు సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు.

Prabhas 25th Movie announce on Oct 7

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News